Aadavallu Meku Joharlu Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Aadavallu Meku Joharlu Movie 2022: 'ఆడవాళ్లు మీకు జోహార్లు' విడుదల ఎప్పుడంటే ?

Published Fri, Jan 28 2022 7:36 PM | Last Updated on Fri, Jan 28 2022 8:38 PM

Sharvanand Aadavallu Meku Joharlu Movie 2022 Release In February - Sakshi

Sharvanand Aadavallu Meku Joharlu Movie 2022 Release In February: నేషనల్​ క్రష్​ రష్మిక మందన్నా, యంగ్​ అండ్​ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్​ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ సినిమాకు కిశోర్​ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్​ బ్యానర్​పై సుధాకర్​ చెరుకూరి నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా ఈ సినిమా రాబోతుంది. ఒక పాట మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుందని మేకర్స్​ ప్రకటించారు. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో సినిమా ప్రమోషన్స్​ చేయనున్నారు. 

ఈ చిత్రంలో శర్వానంద్​ పక్కింటి కుర్రాడి పాత్రలో నటిస్తుండగా, రష్మిక పాత్ర మంచి అనుభూతిని ఇస్తుందని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాలో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యతను టైటిల్​ తెలియజేసేలా ఉంది. ఖుష్బు, రాధిక శరత్​ కుమార్​, ఊర్వశి, వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు నటిస్తున్నారు. రాక్​స్టార్ దేవిశ్రీ ప్రసాద్​ సౌండ్​ట్రాక్​లు అందించగా, శ్రీకర్ ప్రసాద్​ ఎడిటర్​గా బాధ్యతలు నిర్వర్తించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement