మెగా హీరో చేతికి నాని సినిమా | Nani and Kishore Tirumala project halted | Sakshi

Feb 21 2018 3:27 PM | Updated on Sep 27 2018 8:49 PM

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నానితో భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా ప్లాన్ చేసింది. ఈ సినిమాకు నేను శైలజతో సూపర్‌ హిట్ కొట్టిన కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించనున్నట్టుగా ప్రకటించారు. అయితే చాలా రోజులుగా చర్చల దశలో ఉన్న ఈ సినిమాలో కీలక మార్పు జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు కిశోర్‌ చెప్పిన కథపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేయకపోవటంతో ఈ ప్రాజెక్ట్ చేతులు మారిందట.

నానికి చెప్పిన కథతోనే మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా సినిమాను తెరకెక్కించాలని భావిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ. అయితే సుప్రీం హీరో కూడా ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉన్నాడు. కరుణాకరన్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సాయి.. తరువాత మారుతి, గోపిచంద్‌ మలినేనిలతో సినిమాలు చేయాల్సి ఉంది. మరి ఈ ప్రాజెక్ట్‌ లు అయిపోయాకే కిశోర్‌ తిరుమలకు ఛాన్స్‌ ఇస్తాడా..? లేక ముందే ఈ సినిమాను స్టార్ట్‌ చేస్తాడా చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement