సుప్రీం హీరోతో రితికా? | Is Ritika Singh Going To Act In Sai Dharam Tej Next Movie | Sakshi
Sakshi News home page

Published Wed, May 23 2018 3:54 PM | Last Updated on Wed, May 23 2018 4:07 PM

Is Ritika Singh Going To Act In Sai Dharam Tej Next Movie - Sakshi

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌కు ప్రస్తుతం కాలం కలిసిరావడంలేదనే చెప్పాలి. చేసిన ప్రతీ సినిమా బెడిసికొడుతోంది. మాస్‌ జపం చేస్తూ... మూస ధోరణిలో సినిమాలు చేయడమే దానికి కారణం అని తెలిసినట్టుంది ఈ హీరోకి. అందుకే గేర్‌ మార్చి ప్రేమకథలపై పడినట్టు కనిపిస్తోంది. ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే కరుణాకరన్‌ డైరెక్షన్‌లో ‘తేజ్‌ ఐ లవ్‌ యూ’ అనే సినిమాను చేస్తున్నాడు. 

తదుపరి చిత్రంగా నేను శైలజ ఫేం కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు. కిశోర్‌ గత చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా ఆశించినంతగా విజయం సాధించలేదు. అందుకే సాయిధరమ్‌ సినిమాతో తిరిగి ప్రూవ్‌ చేసుకునే ఆలోచనలో ఉన్నాడు ఈ యంగ్‌ డైరెక్టర్‌. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌గా కల్యాణీ ప్రియదర్శన్‌ను ఫైనల్‌ చేశారు. మరో హీరోయిన్‌ పాత్రకు అనుపమా పరమేశ్వరన్‌ తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా అనుపమా స్థానంలో గురు ఫేం రితికా సింగ్‌ పేరు వినిపిస్తోంది. ఫైనల్‌ గా ఎవరు సాయిధరమ్‌ తో జోడి కడతారో తెలియాలంటే అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వరకు వెయిట్ చేయాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement