కొత్త కథ... కొత్త లుక్‌ | Ram Pothineni New Film Launched Today | Sakshi
Sakshi News home page

కొత్త కథ... కొత్త లుక్‌

Published Wed, Mar 29 2017 11:01 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

కొత్త కథ... కొత్త లుక్‌

కొత్త కథ... కొత్త లుక్‌

గుబురు గడ్డం... కోర మీసం... కండలు తిరిగిన దేహం... కళ్లల్లో ఆనందం... హ్యాండ్సమ్‌ లుక్‌లో  కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు రామ్‌. ఈ కాన్ఫిడెన్స్‌తో కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. నటుడిగా, హీరోగా ‘నేను శైలజ’తో రామ్‌కు మంచి పేరు తీసుకొచ్చిన కిశోర్‌ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్‌ కథానాయికలు. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పీఆర్‌ సినిమాస్‌ పతాకాలపై ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కొసరాజు రామ్మోహనరావు క్లాప్‌ ఇచ్చారు. ‘స్రవంతి’ రవికిశోర్‌ మాట్లాడుతూ – ‘‘రామ్‌ లుక్, స్టైల్‌ దగ్గర్నుంచి సినిమాలో ప్రతిదీ కొత్తగా ఉంటుంది. కిశోర్‌ తిరుమల మంచి కథ రెడీ చేశారు. ఏప్రిల్‌ 24న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘ఫ్రెష్‌ కాన్సెప్ట్‌తో, సినిమాలోని పాత్రలతో ప్రేక్షకులు తమను ఐడెంటిఫై చేసుకునేలా చిత్రాన్ని రూపొందిస్తున్నాం.

ప్రతి క్యారెక్టర్‌ లైవ్లీగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. యువ హీరో శ్రీవిష్ణు, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి నటించనున్న ఈ చిత్రానికి కళ: ఏఎస్‌ ప్రకాశ్, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్, సాహిత్యం: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కెమేరా: సమీర్‌రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement