టాలీవుడ్లో మరో సిక్స్ ప్యాక్ హీరో | Young Hero Ram to bare six pack body | Sakshi
Sakshi News home page

టాలీవుడ్లో మరో సిక్స్ ప్యాక్ హీరో

Published Thu, Mar 23 2017 1:32 PM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

టాలీవుడ్లో మరో సిక్స్ ప్యాక్ హీరో - Sakshi

టాలీవుడ్లో మరో సిక్స్ ప్యాక్ హీరో

ఒకప్పుడు బాలీవుడ్కు మాత్రమే పరిమితమైన సిక్స్ ప్యాక్స్ బాడీ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోనూ కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలు ఆరుపలకల దేహంతో ఆకట్టుకోగా.. తాజాగా మరో యంగ్ హీరో కూడా ఈ లిస్ట్లో చేరేందుకు రెడీ అవుతున్నాడు. నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన నెక్ట్స్ సినిమాలో సిక్స్ బ్యాడీతో కనిపించనున్నాడు.

కొద్ది రోజులుగా కాలీగా ఉన్న యంగ్ హీరో రామ్ త్వరలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను ప్రారంభించనున్నాడు. ఇదే కాంబినేషన్లో రూపొందిన నేను శైలజ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా రామ్ కూడా కొత్త సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా లవర్ భాయ్ లుక్లో మాత్రమే కనిపించిన రామ్, ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో అలరించనున్నాడట.

రామ్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను రామ్ సొంతం నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. గత ఆరు నెలలుగా ఏ సినిమాకు అంగీకరించకుండా కాలీగా ఉన్న రామ్, కొత్త సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement