అప్పుడు దిమాక్‌ ఖరాబ్‌.. ఇప్పుడు డింఛక్‌ | Ram Pothineni Birthday Treat For His Fans From Red Movie | Sakshi
Sakshi News home page

రామ్‌ బర్త్‌డే గిఫ్ట్‌ అదిరింది..

Published Fri, May 15 2020 10:15 AM | Last Updated on Fri, May 15 2020 10:33 AM

Ram Pothineni Birthday Treat For His Fans From Red Movie - Sakshi

ఇస్మార్ట్‌ శంకర్‌తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకున్న హీరో రామ్‌ పోతినేని ప్రస్తుతం ‘రెడ్‌’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. ఈ రోజు హీరో రామ్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని రామ్‌ అభిమానులకు కానుకగా ‘రెడ్‌’ చిత్రంలోని ‘డింఛక్‌’ అనే మాస్‌ సాంగ్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ పాటను మణిశర్మ కంపోజ్‌ చేయగా సాకేత్‌, కీర్తనలు పాడారు. జానీ మాస్టర్‌ డ్యాన్స్‌ కొరియగ్రఫీ, కాసర్ల శ్యామ్‌ లిరిక్స్‌ అందించారు. ఇక ఈ సాంగ్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలోని ‘దిమాక్‌ ఖరాబ్‌’ సాంగ్‌ రేంజ్‌లో హిట్టయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ లవ్ ట్రాక్‌కు ప్రేక్షకులను విశేష ఆదరణ లభించిన విషయం తెలసిందే.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా తన పుట్టిన రోజు వేడుకలకు అభిమానులు దూరంగా ఉండాలని రామ్‌ పిలుపునిచ్చారు. అభిమానుల ఆరోగ్యం, సంతోషమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని.. అదే తనకు ఇచ్చే అసలైన పుట్టిన రోజు కానుకగా భావిస్తానని రామ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇక తమ హీరో పిలుపు మేరకు ఆయన బర్త్‌డే వేడుకలకు రామ్‌ అభిమానులు దూరంగా ఉన్నారు. అయితే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ హీరోకు బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. రామ్‌ కెరీర్‌లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ ‘రెడ్‌’ చిత్రం తమిళ హిట్‌ ‘తడమ్‌’కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. 

చదవండి:
ఇన్నాళ్లకు కౌశల్‌కు సినిమా అవకాశం
బాలయ్య కోసం భారీగా శత్రు గణం



 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement