సినీ ఇండస్ట్రీపై రామ్‌ ఆసక్తికర ట్వీట్‌ | Ram Pothineni Interesting Tweet On Movie Industry | Sakshi
Sakshi News home page

రామ్‌ ట్వీట్‌.. అంతర్యం ఏమిటి?

Published Tue, May 19 2020 3:33 PM | Last Updated on Tue, May 19 2020 3:50 PM

Ram Pothineni Interesting Tweet On Movie Industry - Sakshi

‘సినీ ఇండస్ట్రీలో ఓ విషయం ఉంది. సినిమా అనేది కొందరికి ఫ్యాషన్, చాలా మందికి వ్యాపారం.. మిగిలిన వారందరికీ అదొక ఆట’ అంటూ ఎనర్జటిక్‌ హీరో రామ్‌ పోతినేని ఆసక్తికరమైన ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఆయన హీరోగా నటించిన ‘రెడ్‌’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో ‘రెడ్‌​’ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా విడుదల చేస్తారని అనేక వార్తలు వస్తున్న తరుణంలో రామ్‌ చేసిన ట్వీట్‌తో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రామ్‌ ట్వీట్‌లో అంతర్యం ఏమిటో తెలియక టాలీవుడ్‌ వర్గాలు తికమకపడుతున్నాయి. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌లు హీరోయిన్లుగా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. 


చదవండి:
వైరల్‌: చిరు ఎత్తుకున్న ఆ హీరో ఎవరు?
ఎన్టీఆర్‌ బర్త్‌డే: చిన్న సర్‌ప్రైజ్‌ ఉంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement