![Sharwanand Speech In Aadavallu Meeku Joharlu Movie Thank You Meet - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/6/sharwananad.jpg.webp?itok=5E3tOqrG)
‘‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాని నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా చూసి, బాగుందన్నారు. మా సినిమా చూసినవారిలో ఒక్కరు కూడా బాగోలేదని అనడం నేను వినలేదు’’ అని శర్వానంద్ అన్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మికా మందన్న జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదలయింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.
శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో నవ్విస్తామని ముందే చెప్పాం.. అన్నట్లుగానే థియేటర్లలో ప్రేక్షకులు నవ్వుతూనే ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేస్తున్నామని వారు చెబుతుండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘మా అమ్మానాన్న ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చూసి, ఒక మంచి సినిమా చూశామన్నారు. కుటుంబమంతా కలిసి మా సినిమా చూస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు రష్మిక. ‘‘నేను శైలజ’ కంటే ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’తో మీకు మంచి గుర్తింపు వచ్చింది’’ అని ఈ సినిమా చూసిన మా వీధిలోని వారందరూ చెప్పడం సంతోషంగా ఉంది’’ అన్నారు కిశోర్ తిరుమల. ‘‘ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు సహనిర్మాత శ్రీకాంత్. కెమెరామేన్ సుజిత్, నటీమణులు రుచిత, దీప్తి మాట్లాడారు.
చదవండి: Aadavallu Meeku Johaarlu Review: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ ఎలా ఉందంటే?
Comments
Please login to add a commentAdd a comment