ఇటు వినోదం... అటు కుటుంబం | venkatesh next movie with nenu shailaja fame kishor tirumala | Sakshi
Sakshi News home page

ఇటు వినోదం... అటు కుటుంబం

Published Sun, Aug 7 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

ఇటు వినోదం... అటు కుటుంబం

ఇటు వినోదం... అటు కుటుంబం

ఇటు వినోదం.. అటు కుటుంబం.. రెండూ ఉన్న కథలంటే విక్టరీ వెంకటేశ్‌కి బాగా ఇష్టం. కాసేపు నవ్విస్తూ, ఇంకాసేపు కంటతడి పెట్టిస్తూ.. ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగించే చిత్రాల్లో నటిస్తుంటారాయన. వెంకటేశ్ కథానాయకుడిగా ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కను న్న చిత్రం ఈ కోవలోనే ఉంటుందట. మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో పి.ఆర్.సినిమాస్ పతాకంపై పూస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించనున్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానుంది.

‘‘పూర్తి స్థాయి వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ తరహాలో ఉంటుంది. వెంకటేశ్ పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ఆయన్నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి’’ అని నిర్మాత అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement