nenu Shailja
-
కాంబినేషన్ రిపీట్
ఓ నోట్ ఎక్కువ కాదు.. ఓ నోట్ తక్కువ కాదు.. ‘నేను శైలజ’లో కథతో పాటు రామ్ నటన పర్ఫెక్ట్ నోట్లో సాగింది. సాధారణంగా రామ్ ఏ సినిమా చేసినా, అందులో అతడి డ్యాన్సులు, ఎనర్జీ గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు. కానీ, ‘నేను శైలజ’లో రామ్ సెటిల్డ్ యాక్టింగ్ చేశాడని మంచి పేరొచ్చింది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్లో సగం ‘నేను శైలజ’ కథా రచయిత, దర్శకుడు కిశోర్ తిరుమలకు దక్కుతుంది. రామ్‌లోని అంత మంచి నటుడిని బయటకు తీసింది ఆయనే కదా మరి! తాజా ఖబర్ ఏంటంటే... ‘నేను శైలజ’ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మరోసారి రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్, ‘స్రవంతి’ రవికిశోర్లకు దర్శకుడు కథ చెప్పడం, వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగాయట! స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని సమాచారం. ‘నేను శైలజ’కు పూర్తి భిన్నంగా ఈ కథ ఉంటుందట. ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లాలనుకుంటున్నారని భోగట్టా. -
ఇటు వినోదం... అటు కుటుంబం
ఇటు వినోదం.. అటు కుటుంబం.. రెండూ ఉన్న కథలంటే విక్టరీ వెంకటేశ్‌కి బాగా ఇష్టం. కాసేపు నవ్విస్తూ, ఇంకాసేపు కంటతడి పెట్టిస్తూ.. ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగించే చిత్రాల్లో నటిస్తుంటారాయన. వెంకటేశ్ కథానాయకుడిగా ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కను న్న చిత్రం ఈ కోవలోనే ఉంటుందట. మల్టీడైమన్షన్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో పి.ఆర్.సినిమాస్ పతాకంపై పూస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించనున్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ‘‘పూర్తి స్థాయి వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ తరహాలో ఉంటుంది. వెంకటేశ్ పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ఆయన్నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి’’ అని నిర్మాత అన్నారు.