కాంబినేషన్‌ రిపీట్‌ | Combination Repeat | Sakshi

కాంబినేషన్‌ రిపీట్‌

Mar 2 2017 11:47 PM | Updated on Sep 5 2017 5:01 AM

కాంబినేషన్‌ రిపీట్‌

కాంబినేషన్‌ రిపీట్‌

ఓ నోట్‌ ఎక్కువ కాదు.. ఓ నోట్‌ తక్కువ కాదు.. ‘నేను శైలజ’లో కథతో పాటు రామ్‌ నటన పర్‌ఫెక్ట్‌ నోట్‌లో సాగింది.

ఓ నోట్‌ ఎక్కువ కాదు.. ఓ నోట్‌ తక్కువ కాదు.. ‘నేను శైలజ’లో కథతో పాటు రామ్‌ నటన పర్‌ఫెక్ట్‌ నోట్‌లో సాగింది. సాధారణంగా రామ్‌ ఏ సినిమా చేసినా, అందులో అతడి డ్యాన్సులు, ఎనర్జీ గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు. కానీ, ‘నేను శైలజ’లో రామ్‌ సెటిల్డ్‌ యాక్టింగ్‌ చేశాడని మంచి పేరొచ్చింది.

ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌లో సగం ‘నేను శైలజ’ కథా రచయిత, దర్శకుడు కిశోర్‌ తిరుమలకు దక్కుతుంది. రామ్‌లోని అంత మంచి నటుడిని బయటకు తీసింది ఆయనే కదా మరి! తాజా ఖబర్‌ ఏంటంటే... ‘నేను శైలజ’ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌ మరోసారి రామ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్, ‘స్రవంతి’ రవికిశోర్‌లకు దర్శకుడు కథ చెప్పడం, వాళ్లు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగాయట! స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తయిందని సమాచారం. ‘నేను శైలజ’కు పూర్తి భిన్నంగా ఈ కథ ఉంటుందట. ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లాలనుకుంటున్నారని భోగట్టా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement