హమ్మయ్య.. రామ్ డేట్ చెప్పేశాడు..! | Ram, Kishore Tirumala film gets a launch date | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. రామ్ డేట్ చెప్పేశాడు..!

Published Sat, Mar 18 2017 3:06 PM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM

హమ్మయ్య.. రామ్ డేట్ చెప్పేశాడు..!

హమ్మయ్య.. రామ్ డేట్ చెప్పేశాడు..!

నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఎనర్జిటిక్ హీరో రామ్, ఆ తరువాత రిలీజ్ అయిన హైపర్తో మరోసారి ఆకట్టుకున్నాడు. అయితే హైపర్ తరువాత ఎలాంటి సినిమా చేయాలన్న ఆలోచనతో చాలా రోజులు పాటు సినిమాను ఎనౌన్స్ చేయకుండా కాలం గడిపేశాడు. ఈ గ్యాప్లో కరుణాకరణ్, అనీల్ రావిపూడి లాంటి దర్శకులతో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించినా.. ఏది సెట్స్ మీదకు రాలేదు.

ఫైనల్గా మరోసారి నేను శైలజ కాంబినేషన్కే ఫిక్స్ అయ్యాడు రామ్. మరోసారి కిశోర్ తిరుమల దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రారంభించనున్నారు. రామ్ కండలు తిరిగిన దేహంతో కనిపించనున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాష్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేను శైలజ సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి అదే కాంబినేషన్లో పనిచేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement