
మెగా మేనల్లుడిగా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ మొదట్లో ఫుల్ జోష్‌లో ఉన్న హీరో.. ఈ మధ్య కాస్త తడబడ్డాడు. వరుసబెట్టి ప్లాఫులిస్తున్న ఈ మెగా హీరోకు టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. ఈ మధ్యే తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు.
‘నేను శైలజా’ ఫేమ్ కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో ‘చిత్రలహరి’ అనే సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని.. అందులోనూ ఏప్రిల్ 19న చేయాలని అనుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ మొదటివారంలో మహేష్ బాబు మహర్షి చిత్రం థియేటర్లలో సందడి చేయనుండగా.. చిత్రలహరిని రెండు వారాల గ్యాప్‌తో రిలీజ్‌చేయాలని భావించారు. అయితే ఇప్పుడు ఇదే డేట్‌కు నాని జెర్సీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మరి చిత్రలహరిని నానికి పోటీగా వదులుతారో.. లేక వాయిదా వేస్తారో చూడాలి. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment