
పూరి జగన్నాథ్ – రామ్ కాంబినేషన్‌లో వచ్చిన మాస్ మసాలా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. సంచలనాత్మక విజయం సాధించిన ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందని సమాచారం. రామ్ పోషించిన పాత్రలో బాలీవుడ్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్ కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని తెలిసింది. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో ఇంకా ప్రకటించలేదు. ఈ హిందీ రీమేక్‌ను పూరి జగన్నాథే దర్శకత్వం వహించే అవకాశం ఉందని ఓ టాక్.