
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇస్మార్ట్ శంకర్. హీరోయిన్ చార్మీతో కలిసి పూరి జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో నటించబోయే మరో హీరోయిన్‌ను ప్రకటించారు చిత్రయూనిట్.
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్‌లో మరో హీరోయిన్‌గా నటించనుందట. ఈ సినిమాలో నభా పక్కా హైదరాబాదీ అమ్మాయి పాత్రో కనిపించనుందట. తొలి సినిమాలో నేచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్న నభా ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకుంటుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment