రెండు మంచి పనులు చేశా: పూరి | Ram, Puri Jagannadh's iSmart Shankar Blockbuster Success Meet | Sakshi
Sakshi News home page

రెండు మంచి పనులు చేశా: పూరి

Published Sat, Aug 3 2019 4:40 PM | Last Updated on Sat, Aug 3 2019 4:54 PM

Ram, Puri Jagannadh's iSmart Shankar Blockbuster Success Meet - Sakshi

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై నిర్మించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుద‌లైంది. స‌క్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతూ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి రూ.75 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఈ సందర్భంగా శ‌నివారం చిత్రయూనిట్‌ సక్సెస్‌మీట్ నిర్వహించారు.

ఈ సందర్బంగా పూరీ జగన్నాథ్‌ మాట్లాడుతూ... ‘నేను ఈ మధ్య కాలంలో చేసిన రెండు మంచి పనులు రామ్‌ను కలకడం, ఇస్మార్ట్ శంకర్ సినిమా తీయడం. అందరి ఆదరణతో ఈ సినిమా ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా చూసి చాలా మంది నా మిత్రులు అప్రిసియేట్ చేసారు. రామ్ ఎనర్జీ ఈ సినిమాను నిలబెట్టింది. ఈ సినిమా సక్సెస్ టూర్ వెళ్ళినప్పుడు అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. రామ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోడం ఆనందమేసింది’ అన్నారు.

హీరో రామ్ మాట్లాడుతూ... ‘సినిమా చూశాక ఎలా ఫీల్ అయ్యానో ఆడియన్స్ రెస్పాన్స్ చూసాక అదే ఫీల్ అయ్యాను. నేను ఇదివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో నా పాత్ర ఉంది, అందుకు కారణం పూరీ గారు. నాకు ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చి నన్ను డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసారు. ఈ సక్సెస్‌ను నా మంచి కోరుకునే వారందరికీ డెడికేట్ చేస్తున్నాను. మణిశర్మ గారి సంగీతం హీరోయిన్స్ గ్లామర్ సినిమా సక్సెస్‌కు యాడ్ అయ్యాయి.  సినిమాలో నటించిన ఇతర నటీనటులకు టెక్నీషియన్స్‌కు థాంక్స్’ అన్నారు.

చార్మి మాట్లాడుతూ...‘మా సినిమాను ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ చేసిన అందరికీ థాంక్స్. సక్సెస్ టూర్‌లో ఎక్కడికి వెళ్లినా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. రామ్ తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే నిధి, నభా న‌టేశ్‌, ఇద్దరూ చాలా బాగా నటించారు. ఇంత రెస్పాన్స్ ఎక్స్‌పెక్ట్  చేయలేదు. పూరి గారు రామ్ పాత్రను బాగా డిజైన్ చేశారు, అదే సినిమా సక్సెస్‌కు మెయిన్ రీజన్ అయ్యింది. రామ్‌కు స్రవంతి మూవీస్ ఫస్ట్ బ్యానర్ అయితే పూరి కనెక్స్ సెకండ్ హోమ్ బ్యానర్ లాంటిది. కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. త్వరలో మరో ఈవెంట్‌తో మిమ్మల్ని కలుస్తాను’ అన్నారు.

హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ... ‘నాకు చాలా  క్రూషియల్ టైమ్‌లో ఈ హిట్ వచ్చింది. ఇది కెరీర్‌కి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన పూరి గారికి, అలాగే నాకు ఎంతో సపోర్ట్ చేసిన ఛార్మి గారికి థాంక్స్. రామ్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే న‌భా న‌టేశ్‌ బాగా నటించింది’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement