వారణాసిలో డిష్యూం డిష్యూం | iSmart Shankar Action Episode in Varanasi | Sakshi
Sakshi News home page

వారణాసిలో డిష్యూం డిష్యూం

Published Wed, May 1 2019 12:00 AM | Last Updated on Wed, May 1 2019 12:00 AM

iSmart Shankar Action Episode in Varanasi - Sakshi

ఇస్మార్ట్‌ శంకర్‌తో పెట్టుకుంటే చాలా స్మార్ట్‌గా రప్ఫాడిస్తాడు. ఇప్పుడు అదే పనిమీద వారణాసి వెళ్లాడు. అక్కడ విలన్లను ఉతుకుడే ఉతుకుడు. వీర లెవల్లో శంకర్‌ చేసిన ఈ ఫైట్స్‌ని ఈ నెలలోనే చూడొచ్చు. ఇస్మార్ట్‌ శంకర్‌గా టైటిల్‌ రోల్‌లో రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ‘డబుల్‌ దిమాక్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను ఫైట్‌మాస్టర్‌ రియల్‌ సతీష్‌ ఆధ్వర్యంలో వారణాసిలో చిత్రీకరిస్తున్నారు.

పూరి స్టయిల్‌లో సాగే ఈ ఫైట్‌ సీన్స్‌లో హీరో హీరోయిన్‌ రామ్, నిధి అగర్వాల్‌తో పాటు కీలక పాత్రధారులు ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, దీపక్‌ శెట్టి, తులసి తదితరులు పాల్గొంటున్నారు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్, పూరి కనెక్ట్స్‌ బ్యానర్స్‌పై ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. నభా నటేష్‌ ఓ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement