
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లోనే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రానుంది. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ సినిమాను నిర్మించనున్నారు.
నేడు (మే 15) రామ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆదివారం ‘డబుల్ ఇస్మార్ట్’ని ప్రకటించి, ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘‘అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, హై బడ్జెట్‌తో ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తెరకెక్కనుంది. ఈసారి రెట్టింపు మాస్, రెట్టింపు వినోదాన్ని ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment