
చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో రామ్, ఇస్మార్ శంకర్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా 75 కోట్లకుపైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం ఇస్మార్ శంకర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రామ్ డిఫరెంట్ లుక్‌లో షాక్ ఇచ్చాడు.
సినిమా రిలీజ్ సమయంలో ఫారిన్‌లో ఉన్న రామ్, కాస్త ఆలస్యంగా ప్రమోషన్‌లో జాయిన్ అయ్యాడు. అన్ని ప్రమోషన్, సక్సెస్ కార్యక్రమాల్లో టోపి పెట్టుకొని కనిపించాడు. తాజాగా తన న్యూ లుక్‌ను సోషల్ మీడియాలో రివీల్ చేశాడు రామ్. గుండుతో ఉన్న రామ్ లుక్ చూసి అభిమానులకు షాక్ అవుతున్నారు. సాధారణంగా మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేయరు. మరి రామ్ ఎందుకు గుండు చేయించుకున్నట్టు.. ఏదైనా సినిమా కోసమా లేక.. సరదాగా ట్రై చేశాడా అన్న చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment