
టైమ్ చెప్పి మరీ వచ్చే అతికొద్దిమంది దర్శకుల్లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. తక్కువ టైమ్‌లో సినిమాను పూర్తి చేసి హిట్ కొట్టగల ఈ దర్శకుడు ఇప్పుడు తన పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. స్టార్ హీరోతో డెబ్బై రోజుల్లో సినిమాను పూర్తి చేసి హిట్ కొట్టిన ట్రాక్ రికార్డు ఉన్న ఈ డైరెక్టర్.. ప్రస్తుతం చేస్తోన్న మూవీని స్లోగానే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ను ప్రారంభించిన పూరి.. మే 31 ఈ చిత్రాన్ని విడుదల చేస్తానని ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు మళ్లీ ఆ ఊసెత్తలేదు. ఇప్పటికీ ఒక్క పోస్టర్, టీజర్ కూడా వదల్లేదు. ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. చూస్తుంటే ఈ చిత్రం మేలో విడుదల కాదని తెలుస్తోంది. మేలో మహర్షి సందడి ఉంటుందని తెలిసే.. మెల్లగా తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దామనే ఆలోచనలో పూరి ఉన్నట్లు ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment