
సాక్షి, హైదరాబాద్ : ‘ధూమపానం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ ఈ ప్రకటన ప్రతి సినిమా ప్రారంభ సమయంలో చూస్తూనే ఉంటాం. బహిరంగ ప్రదేశాలలో సిగరేట్ తాగితే జరిమాన విధిస్తారని అందరికి తెలుసు కానీ, చాలా మంది బహిరంగంగానే సిగరేట్లు తాగుతారు. దీనికి హీరో రామ్ కూడా అతీతుడిని కాదనిపించుకున్నాడు. బహిరంగంగా సిగరేట్ తాగుతూ.. రూ. 200 జరిమానా చెల్లించాడు. ఇస్మార్ట్ శంకర్ షూటింగ్‌లో భాగంగా చార్మినార్ వెళ్లిన రామ్.. షూటింగ్ తర్వాత బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగాడు. ఇది గమనించిన చార్మినార్ ఎస్సై పండరీ రామ్‌కు రూ.200 జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment