ఇస్మార్ట్‌ మ్యూజిక్‌  | Ram Pothineni starrer Double Ismart to have an extravagant climax: TOLLYWOOD | Sakshi
Sakshi News home page

ఇస్మార్ట్‌ మ్యూజిక్‌

Published Fri, Jan 26 2024 3:37 AM | Last Updated on Fri, Jan 26 2024 3:37 AM

Ram Pothineni starrer Double Ismart to have an extravagant climax: TOLLYWOOD - Sakshi

‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జోరందుకున్నాయి. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ మొదలయ్యాయి.

ఈ విషయాన్ని ‘ఎక్స్‌’లో షేర్‌ చేసి, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ అప్‌డేట్‌ను వెల్లడించింది చిత్రబృందం. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సంగీతం అందించిన మణిశర్మనే సీక్వెల్‌కూ సంగీతం అందిస్తున్నారు. గతంలోనూ పూరి–మణిశర్మ కాంబినేషన్‌లో ‘పోకిరి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ ఆల్బమ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా క్లైమాక్స్‌ పోర్షన్స్‌ చిత్రీకరణ కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా సమాచారం. పూరి  జగన్నాథ్, ఛార్మీ కౌర్‌ నిర్మిస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమాను మార్చి 18న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ గతంలో ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్నది ఫిల్మ్‌నగర్‌ తాజా కబురు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement