ముంబైలో డబుల్‌ ఇస్మార్ట్‌ | Ram Double iSmart shooting at Mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో డబుల్‌ ఇస్మార్ట్‌

Published Thu, Nov 2 2023 4:27 AM | Last Updated on Thu, Nov 2 2023 4:27 AM

Ram Double iSmart shooting at Mumbai - Sakshi

హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సూపర్‌ హిట్టయిన విషయం తెలిసిందే. తాజాగా రామ్, పూరి కాంబినేషన్‌లోనే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ తెరకెక్కుతోంది. ఇందులో సంజయ్‌ దత్‌ కీలక ΄ాత్రధారి. ఈ సినిమా కోసం ముంబైలో రామ్‌ ΄ాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

‘‘స్కంద’ కోసం బరువు పెరిగిన రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కోసం బరువు తగ్గి, సిక్స్‌ ΄్యాక్‌తో మేకోవర్‌ అయ్యారు’’ అని యూనిట్‌ పేర్కొంది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 8న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement