
వరుస ప్లాఫులతో సతమతమవుతున్న..డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో కలిసి ఇస్మార్ట్ శంకర్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఫుల్ స్వింగ్‌లో షూటింగ్‌ను పూర్తి చేస్తున్న పూరి.. ఈ మూవీ సక్సెస్‌పై నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.
చిత్రయూనిట్ ప్రస్తుతం దిమాక్ ఖరాబ్ సాంగ్‌ను షూట్ చేస్తోంది. ఈ పాట చిత్రీకరణ సమయంలో.. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ లొకేషన్‌లో ప్రత్యక్షమయ్యారు. చిత్రయూనిట్‌తో సుక్కు సరదాగా ముచ్చటించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలను చార్మీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘రౌడీ గారు.. సుకుమార్.. లొకేషన్‌కు రావడంతో ఎంతో సరదాగా ఉంది. థ్యాంక్స్ ఫర్ ఆల్ కాంప్లీమెంట్స్’ అంటూ చార్మీ ట్వీట్ చేసింది.
Was so much fun having rowdy garu @aryasukku on sets of #ismartshankar #dimaakkharab song location .. thanks for all the compliments 🤗🤗 @ramsayz @purijagan @puriconnects #PCfilm #happyugadi pic.twitter.com/S1f6BMhjZo
— Charmme Kaur (@Charmmeofficial) April 6, 2019
Comments
Please login to add a commentAdd a comment