
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పూరి మార్క్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పూరి స్టైల్‌లోనే ‘ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న హీరో రామ్, డైరెక్టర్ పూరికి ఓ కాస్ట్‌లీ గిఫ్ట్‌ను ఇచ్చాడు. ఈ విషయాన్ని పూరీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
‘మేరా ఇస్మార్ట్ శంకర్.. రామ్, నాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘కోపి లువాక్’ కాఫీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రస్తుతం నేను ఆ కాఫీ తాగుతున్నాను. ఈ కాఫీ గురించి గూగుల్ చేయండి. మీకు దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన రామ్ ‘గూగుల్ చేయకండ్రి.. మ్యాటర్ తెలిస్తే ధిమాక్ ఖరాబ్ ఐతది’ అంటూ రిప్లై ఇచ్చాడు.
Google cheyakandri...matter teliste dhimaak kharaab ayitaadi! 🤯👈 - IS 😜 https://t.co/jPBt2aBmMM
— RAm POthineni (@ramsayz) 5 February 2019
Comments
Please login to add a commentAdd a comment