
గోవాలో అదిరిపోయే స్టెప్పులేస్తున్నారు హీరో రామ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్ హైదరాబాదీ’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టాకీపార్ట్ పూర్తయింది. ప్రస్తుతం హీరో రామ్, నభా నటేశ్‌లపై గోవాలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను బుధవారం విడుదల చేయనున్నారు. మరి... డబుల్ దిమాక్ హైదరాబాదీ పవర్ ఏంటో శాంపిల్‌గా చూడొచ్చన్నమాట. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సు«ధాంశు పాండే తదితరులు నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment