
ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 75 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఇప్పటికీ మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. దీంతో మరోసారి పూరీ బిజీ అవుతున్నారు. ఇటీవల పూరీ దర్శకత్వంలో కన్నడ టాప్ హీరో యష్ హీరోగా సినిమా రూపొందుతున్న వార్తలు మీడియాలో హల్‌చల్ చేశాయి.
తాజాగా మరో క్రేజీ స్టార్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరితో సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. చాలా రోజులుగా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా పూరి, విజయ్‌కి పూర్తి స్క్రిప్ట్ వినిపించారని, విజయ్ కూడా త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్తలపై పూరి, విజయ్‌ల నుంచి అధికారిక ప్రకటనా మాత్రం రాలేదు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమాతో పాటు, తమిళ దర్శకు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న హీరో సినిమాల్లో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ.
Comments
Please login to add a commentAdd a comment