
నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ నిధి అగర్వాల్. తొలి సినిమాతోనే గ్లామర్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామ తరువాత మిస్టర్ మజ్ను సినిమాతో మరోసారి ఆకట్టుకున్నారు. తాజాగా ఇస్మార్ట్ శంకర్‌కు జోడిగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అయితే ట్విటర్ వేదికగా ఓ ఆకతాయి వేసిన ప్రశ్నకు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చారు నిధి అగర్వాల్. ఈ సినిమాలో మీరు ఎక్స్‌పోజింగ్ కాకుండా ఇంకేమైనా చేశారు అంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు సమాధానంగా ‘చాలా చేశాను. ట్రైలర్ కాదు మూవీ చూడు’ అంటూ హుందాగా బదులిచ్చారు.
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నభా నటేష్ మరో హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను పూరితో కలిసి చార్మి నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు.
Actually chaala chesanu, trailer kaadu movie chudu
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) 13 July 2019
Comments
Please login to add a commentAdd a comment