షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఇస్మార్ట్ శంకర్‌’ | Ram And Puri Jagannadh iSmart Shankar Shooting Completed | Sakshi
Sakshi News home page

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఇస్మార్ట్ శంకర్‌’

Published Tue, Jul 2 2019 3:21 PM | Last Updated on Tue, Jul 2 2019 3:21 PM

Ram And Puri Jagannadh iSmart Shankar Shooting Completed - Sakshi

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శకుడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నట్లు ద‌ర్శక నిర్మాత‌లు తెలిపారు. మెలోడి బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన నాలుగు పాట‌ల‌కు, టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. హీరో రామ్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. రామ్‌, పూరిల కెరీర్‌కు కీలకమైన సినిమా కావటంతో ఇస్మార్ట్‌ శంకర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement