
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ హైదరాబాదీ అనేది ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
పూరి మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. మిగిలిన నాలుగు పాటలు చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే పుట్టిన రోజైన మే 15న ఇస్మార్ట్ శంకర్ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment