షాట్‌ల కాల్చినం తమ్మీ.. లైట్‌ తీస్కో! | Hero Ram Pothineni Ttweets on Cigarette Issue in iSmart Shankar Shooting | Sakshi
Sakshi News home page

షాట్‌ల కాల్చినం తమ్మీ.. లైట్‌ తీస్కో!

Published Tue, Jun 25 2019 1:10 PM | Last Updated on Tue, Jun 25 2019 5:30 PM

Hero Ram Pothineni Ttweets on Cigarette Issue in iSmart Shankar Shooting - Sakshi

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని బహిరంగ ప్రదేశంలో సిగరెట్‌ కాల్చినందుకు చార్మినార్‌ పోలీసులు రూ.200 ఫైన్‌ వేసిన సంగతి తెలిసిందే. అయితే సంఘటనపై సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో హీరో రామ్‌ ఆ కామెంట్స్‌పై స్పందించాడు. ఇస్మార్ట్ శంకర్‌ స్టైల్‌లోనే రిప్లై ఇచ్చాడు.

‘నా టైమూ పబ్లిక్‌ టైమూ వేస్ట్ చేయడం ఇష్టం లేక రెస్పాండ్ గాలే.. షాట్‌ల కాల్చిన తమ్మీ.. బ్రేక్‌ల కాద్‌.. టైటిల్‌ సాంగ్‌ల చూస్తవ్‌గా స్టెప్పు. ఫిర్‌ బీ లాకీ ఇజ్జత్‌ ఇచ్చి ఫైన్‌ కట్టినం.  గిప్పుడు నువ్వు కూడా నాలెక్క లైట్‌ తీస్కో పని చూస్కో’ అంటూ ట్వీట్ చేశాడు ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ ఉరఫ్‌ రామ్‌ పోతినేని.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్‌ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రామ్‌ సరసన నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాను పూరి, చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement