
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కాంబినేషన్‌లో ఇస్మార్ట్ శంకర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూరి స్టైల్లో రూపొందనున్న ఈ మూవీ షూటింగ్‌ను చకచకా కానిచ్చేస్తున్నారు. వారణాసిలో భారీ యాక్షన్ సీన్స్‌ను షూట్ చేసిన యూనిట్.. ఆ షెడ్యూల్‌కు ప్యాకప్ చేప్పేసింది.
ఇటీవలె వారణాసికి వెళ్లిన చిత్రబృందం.. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. నేటితో ఆ షెడ్యూల్‌కు గుడ్‌బై చెప్పినట్లు.. మరో షెడ్యూల్‌ను రెండు రోజుల్లో హైదరాబాద్‌లోనే స్టార్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిధి అగర్వాల్, నభా నటేష్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment