![Akash Slaps Legal Action on Puri Jagannadh - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/23/aakashh.jpg.webp?itok=Mh6Mwn5D)
ఆకాష్
‘‘ఒక వ్యక్తి మెదడును హీరోకి మార్చే కాన్సెప్ట్‌తో తెలుగు–తమిళ భాషల్లో లేడీ డైరెక్టర్ రాధ నాతో సినిమా తీశారు. ‘నాన్ యార్’ పేరుతో తమిళ చిత్రం విడుదల కాగా, ‘కొత్తగా ఉన్నాడు’ పేరుతో త్వరలో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈలోపు ఇలాంటి మూలకథతో ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ కావడం మాకు షాక్ తగిలినట్లయింది’’ అని ‘ఆనందం’ ఫేమ్ ఆకాష్ అన్నారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం పాత్రికేయులతో ఆకాష్ మాట్లాడుతూ – ‘‘పూరి జగన్నాథ్‌ను సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు. అందుకే తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసి, ఇక్కడ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కాకపోతే చట్టాన్ని ఆశ్రయించాలనుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment