
నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన బ్యూటీ నిధి అగర్వాల్. తరువాత మిస్టర్ మజ్నులో మరో అక్కినేని హీరో అఖిల్‌తో జోడి కట్టినా నిధికి ఇంత వరకు సక్సెస్ మాత్రం దక్కలేదు. దీంతో ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్న ఇస్మార్ట్ శంకర్ మీదే ఆశలు పెట్టుకున్నారు నిధి అగర్వాల్.
ఇటీవల వారణాసి షెడ్యూల్ పూర్తి చేసుకున్నఇస్మార్ట్ శంకర్ చిత్రయూనిట్ త్వరలో పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే నిధి అగర్వాల్ తన పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకోవటంతో ఫారిన్ షెడ్యూల్‌పై అనుమానాలు ఏర్పడ్డాయి. కానీ షెడ్యూల్ తన వల్ల ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో నిధి ఎంతో కష్టపడి అధికారులను సంప్రదించి పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందారు.
దీంతో అనుకున్న సమయానికి ఇస్మార్ట్ శంకర్ ఫారిన్ షెడ్యుల్‌ను ప్రారంభించనున్నారట. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్‌లో నిదితో పాటు నభా నటేష్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. పూరితో కలిసి చార్మి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment