Sanjay Dutt rubbishes reports of him getting injured on sets of KD: 'I am fine and healthy' - Sakshi
Sakshi News home page

Sanjay Dutt : షూటింగ్‌లో పేలుడు.. సంజయ్‌ దత్‌కి గాయాలు? అసలు నిజమిదే

Published Thu, Apr 13 2023 8:12 AM | Last Updated on Thu, Apr 13 2023 10:49 AM

Sanjay Dutt Rubbishes Reports Of Getting Injured While Shooting - Sakshi

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కన్నడ సినిమా ‘కేడీ’ షూటింగ్‌లో గాయపడ్డారంటూ బుధవారం సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. ధృవ సర్జా హీరోగా జోగి ప్రేమ్‌ దర్శకత్వంలో ‘కేడీ: ది డెవిల్‌’ చిత్రం రూపొందుతోంది. బెంగళూరు సమీపంలోని మాగడి వద్ద వేసిన సెట్‌లో ఇటీవల ఫైట్‌ మాస్టర్‌ రవి వర్మ ఆధ్వర్యంలో బాంబు బ్లాస్ట్‌ సీన్స్‌ తీస్తుండగా సంజయ్‌ దత్‌కి గాయాలైనట్లు వార్త గుప్పుమంది.

అయితే ఈ వార్త నిజం కాదని సంజయ్‌ దత్‌ సోషల్‌ మీడియా ద్వారా స్పష్టం చేశారు. ‘‘నాకు గాయాలైనట్లు వచ్చిన వార్త అవాస్తవం. నేను ప్రస్తుతం ‘కేడీ’ షూటింగ్‌లో పాల్గొంటున్నాను. యూనిట్‌ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు’’ అన్నారు సంజయ్‌ దత్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement