అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తోంది. దీనిలో భాగంగా నాట్స్ తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి చొరవతో కాటూరు మెడికల్ కాలేజీ వారి సహకారంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దాదాపు 500 మందికి పైగా రోగులకు శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందించారు.
ఈ మెగా వైద్య శిబిరంలో బీపీ, షుగర్, గుండె, శ్వాస కోస, ఊపిరితిత్తులు, కళ్ళు, ముక్కు, చెవి, గొంతు, ఎముకలు, కీళ్లు ఇలా 12 విభాగాలకు చెందిన వైద్యులు.. రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. జన్మభూమి రుణం కొంత తీర్చుకోవాలనే లక్ష్యంతోనే తాము ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి ఈ సందర్భంగా తెలిపారు.. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ అధ్యక్షుడు, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ మోహన కృష్ణ మన్నవ, స్థానిక ప్రముఖులు మాగలూరి భాను ప్రకాష్, బొల్లు సురేశ్, హరి కొల్లూరు, కిరణ్ కుంచనపల్లి, గ్రామ పెద్దలు శివప్రసాద్, మల్లికార్జున రావు, నరేష్, శ్రీనివాస రావు, బాబు తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజల ఆరోగ్యం కోసం మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్యం, మందులు అందించడం అభినందనీయమని శ్రీ హరి మందాడిని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రశంసించారు. మెగా ఉచిత వైద్య శిబిరంలో ఉచిత వైద్య సేవలు పొందిన వారు తమ కోసం శ్రీ హరి మందాడి చూపిన చొరవ, సేవాభావాన్ని కొనియాడారు.
(చదవండి: టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!)
Comments
Please login to add a commentAdd a comment