అమెరికాలోని తెలుగుసంఘం(ఆటా) ఆధ్వర్యంలో ‘ఝుమ్మందినాదం’ సీనియర్ క్లాసికల్ పాటల పోటీలు జూలై 12 నుంచి 19 తేదీల్లో ఆన్‌లైన్ జూమ్ ద్వారా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 65మంది గాయని గాయకులు అమెరికాలోని పలు రాష్ట్రాలకు చెందినవారు ఆసక్తితో పాల్గొన్నారు. ‘ఝుమ్మంది నాదం’ కార్యక్రమాన్ని ఆల రామ కృష్ణారెడ్డి బోర్డు ఆఫ్ ట్రస్టీ, శారదా సింగిరెడ్డి నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి అమెరికా, భారత్ నుంచి సంగీత దర్శకులు రాజశేఖర్ సూరిభొట్ల, ప్లేబ్యాక్ సింగర్, సంగీత దర్శకులు శ్రీనిహాల్ కొండూరి, ప్లేబ్యాక్ సింగర్ కుమారి, నూతన మోహన్, ప్లేబ్యాక్ సింగర్ వేణు శ్రీరంగం, సింగర్, ఇండియన్ ఐడల్ రన్నర్ అప్ పీవీఎస్‌ఎన్ రోహిత్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
ఆటా సంస్థ సీనియర్స్ నాన్ క్లాసికల్ కేటగిరి గాయనీ గాయకులుగా అపరాజిత పమిడిముక్కల, చైత్ర ఆర్ని, జ్యోత్స్నా ఆకుంది, కార్తిక్ స్వామి, మైన ఏదుల, ప్రణవ్ అర్కటాల, ప్రణవ్ బార్ల, ప్రియాంక కొలనుపాక, శృతి శేఖర్, శ్రీప్రజ్ఞ వెల్లంకి, సుదార్చిత్ సొంటి, తేజశ్రీ మేక, వాదిరాజ్ గర్లపాడ్ ఫైనలిస్ట్స్‌గా ఎంపిక చేశారు. వీరు వాషింగ్టన్, న్యూజెర్సీ, టెక్సాస్, నార్త్ క్యారలిన్, జార్జీయా, ఆరిజోనా,క్యాలిఫోర్నియా, న్యూయార్క్, వర్జీనియా, మిన్నిసోటా రాష్ట్రాలకు చెందిన వారని తెలిపారు.
ఆటా అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ భువనేశ్‌రెడ్డి భుజాల.. బోర్డు ఆఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ చైర్మన్‌లు, రీజనల్ డైరెక్టర్లు, రీజనల్ కో ఆర్డినేటర్స్, ఆటా 2020 కన్వన్షన్ బృందం, ‘ఝుమ్మంది నాదం’ బృందం, సోషల్ మీడియా టీం, ఫైనలిస్ట్స్‌కు అభినందనలు తెలియజేశారు. పోటీలో పాల్గొన్న గాయని, గాయకులు, వారి తల్లిదండ్రులు.. ఆటా సంస్థ కార్యవర్గ బృందానికి, న్యాయ నిర్ణేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో వీక్షిస్తున్న ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను పొందడం సంస్థకు గర్వకారణమని ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీరెడ్డి అన్నారు. ఆటా ‘ఝమ్మంది నాదం’ సెమీ ఫైనల్స్ పాటల పోటీలు ఆగస్ట్2, 2020న, ఫైనల్స్‌ను ఆగస్ట్ 8, 2020 నుంచి 9 వరకు కొనసాగనున్నాయి.
ఆటా సంస్థ లైవ్ ప్రచారం చేస్తున్న మన టీవీ, మన టీవీ ఇంటర్‌నేషనల్, టీవీ5, జీఎన్‌ఎన్, ఏబీఆర్ ప్రొడక్షన్స్, తెలుగు ఎన్‌ఆర్‌ఐ రేడియో, టోరీ రేడియో ఇతర మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఝుమ్మంది నాదం పాటల పోటీ విజయవంతానికి కృషి చేసిన ఆటా కార్యవర్గ బృందానికి ప్రెసిడెంట్ పరమేష్ భీం రెడ్డి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment