
అమెరికా తెలుగు ఆసోసియేషన్ (ఆటా,నాష్‌విల్లే) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సంప్రదాయబద్దంగా గణపతి, దుర్గమాతలకు పూజలు నిర్వహించి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరీమాతను ప్రత్యేకంగా అలంకరించారు. ఎన్నారై మహిళలంతా సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలు పేర్చారు. అనంతరం ఆటపాటల మధ్య బతుకమ్మను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలు ఆటా నాష్‌విల్లే మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగాయి. ఆటా అధ్యక్షుడు భువనేష్ బూజాలతో పాటు మధు బొమ్మినేని, ఆలా రామకృష్ణారెడ్డి, నూకల నరేందర్‌రెడ్డి, గూడూరు కిశోర్, సుశీల్ చందా, రాధికారెడ్డి, లావణ్య నూకల, మంజు లిక్కి, శ్రీలక్ష్మీ, బిందు మాధవి, శిరీష కేస తదితరులు సహయ సహకారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment