అతిధి పాత్రలో మిచెల్లీ ఒబామా! | Michelle Obama to guest star on 'Nashville' | Sakshi
Sakshi News home page

అతిధి పాత్రలో మిచెల్లీ ఒబామా!

Published Sun, Apr 20 2014 12:00 PM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM

అతిధి పాత్రలో మిచెల్లీ ఒబామా!

అతిధి పాత్రలో మిచెల్లీ ఒబామా!

అమెరికన్ మ్యూజికల్ డ్రామా సిరీస్ 'నాష్ విల్లే' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్లీ ఒబామా అతిధి పాత్రలో దర్శనివ్వనున్నారు. మే 7 తేదిన ప్రసారం కానున్న ఏబీసీ డ్రామా ఎపిసోడ్ లో యూఎస్ ప్రథమ పౌరురాలు మిచెల్లీ అతిధి పాత్రలో కనిపించనున్నారు. కోని బ్రిటన్ సరసన మిచెల్లీ నటించనున్నారని ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. 
 
ఇకముందు ఇలాంటి పాత్రలు చేస్తానని అనుకోవడం లేదని, దేనికి వెనకంజ వేయడం తన నైజం కాదని మిచెల్లీ అన్నారు. ఏది మంచి అనుకుంటే దాన్ని మహిళలు స్వీకరించాలని మిచెల్లీ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలోని ఓ క్యారెక్టర్ అఫ్ఘనిస్తాన్ లో గాయపడటంతో మిచెల్లీకి ఈ అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఓ చారిటీ షోలో పాల్గొనాల్సిన మిచెల్లీ ఈ కార్యక్రమంలో నటించడానికి ఒప్పుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement