
కొత్త జాబ్, ఆఫీస్. నచ్చిన వాతావరణంలో పని. మన ఆలోచనలకు అనుగుణంగా ఉండే కొలీగ్స్. ఇదిగో ఆఫీసుల్లో ఇలా ఉండాలని కోరుకుంటాం. కానీ అందుకు విరుద్దంగా ఉంటే అంతే సంగతలు. అందుకే తాను కోరుకున్నట్లు ఆఫీస్ వాతావరణం, బాస్ లేడని ఓ యువతి ఉద్యోగంలో చేరిన మూడు రోజుల్లో తన జాబ్‌కు రిజైన్ చేసిన విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం, ఈ అంశం చర్చాంశనీయంగా మారింది.
ఇటీవల, ఓ యువతి తాను కొత్తగా చేరిన జాబ్, ఆఫీస్ వాతావరణం ఎలా ఉందో ఏకరువు పెట్టింది. ఆమె ఇలా ఎందుకు చేసిందో ఉదహరిస్తూ.. ఉద్యోగం మానేయడం సమంజసమా? లేదంటా అతిగా స్పందించానా’ అంటూ రెడ్డిట్ యూజర్లను సలహా అడిగారు.
‘బాస్ తనకు ఎలాంటి పనులు అప్పగించలేదు. పైగా నేను చెప్పిన పని ఎందుకు చేయలేదని తిట్టాడు. ఆయన అప్పగించిన పనిని వెంటనే పూర్తి చేస్తే.. ఎందుకంత నిధానంగా పనిచేస్తున్నావని ఆరోపించారు. టాయిలెట్‌లో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపినందుకు ప్రశ్నించారు. గతంలో తాను ఎదుర్కొన్న మానసిక సమస్యల గురించి చెప్పనందుకు మరింత మందలించాడు.
ఒత్తిడిని సమస్యను ఎదుర్కొనేలా డాక్టర్లు మెడిసిన్ వేసుకోవాలని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు కొంత కాలం ఆ మెడిసిన్ వేసుకొని మానేశా . ఈ విషయాలన్నీ ఇంటర్వ్యూలో చెప్పాలిగా అని బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడని వాపోయింది.
చివరిగా, నేను అక్కడ పని చేయగలనా అని నిర్ణయించుకోవడానికి రేపటి వరకు (ఈ రోజు) సమయం ఇచ్చారు. బాస్ తీరు నచ్చక. రేపటి వరకు అవసరం లేదని నేనే చెప్పాను. వెంటనే రాజీనామా కూడా చేశా’ అంటూ తన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు.. అలాంటి వాళ్ల దగ్గర పని చేయకపోవడమే బెటర్.. మంచి నిర్ణయం తీసుకున్నావ్, నువ్వు డేరింగ్ లేడీ అంటూ అభినందిస్తున్నారు.
I quit after 3 days
by u/QueenMangosteen in antiwork
చదవండి👉 ఆ వార్తల్లో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రిలయన్స్