![Microsoft cofounder Bill Gates 48 years resume goes viral - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/2/Bill%20Gates.jpg.webp?itok=G1mstUT3)
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం విశేషంగా ఆకట్టుకుంటోంది. 48 ఏళ్ల పాత రెజ్యూమ్ ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన బిల్ గేట్స్ తన రెజ్యూమ్‌ను శుక్రవారం సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేశారు.
‘‘మీలో ఎవరైనా ఇటీవల గ్రాడ్యుయేట్ అయినా లేదా కాలేజీ డ్రాపౌట్ అయినా, మీ రెజ్యూమ్ 48 సంవత్సరాల క్రితం నాటి నా రెజ్యూమ్ కంటే చాలా మెరుగ్గా ఉంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ అని ఆయన తన పోస్ట్‌లో చెప్పారు. 1973 నాటి విలియం హెన్రీ గేట్స్ (బిల్ గేట్స్) రెజ్యూమ్ చూసి మంచి రెజ్యూమ్ కోసం వెబ్‌సైట్‌లు కన్సల్టెంట్లను వెతుక్కునే యూత్ అంతా వావ్ అంటోంది.
సుమారు 48 ఏళ్ల క్రితం తాను ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో అప్పటి రెజ్యూమ్‌ను మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.1973లో బిల్‌గేట్స్ హార్వర్డ్స్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
దీనిపై లింక్డిన్ వినియోగదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక-పేజీ రెజ్యూమ్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు. చాలా బాగుంది. మన జీవితంలో మనం ఎంత సాధించామో చాలాసార్లు మర్చిపోతాం. అందుకే అలాంటి జ్ఞాపకాలం కోసం గత రెజ్యూమ్‌ల కాపీలను దాచుకోవాలని ఒకరు, అది రెజ్యూమ్‌లా లేదు ప్రామిసరీ నోట్‌గా ఉందని మరో యూజర్ వ్యాఖ్యానించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment