టెక్ రెజ్యూమె రూపొందించేదెలా? | How to prepare tech resume ? | Sakshi
Sakshi News home page

టెక్ రెజ్యూమె రూపొందించేదెలా?

Published Sun, Sep 21 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

టెక్ రెజ్యూమె రూపొందించేదెలా?

టెక్ రెజ్యూమె రూపొందించేదెలా?

కొలువు కావాలంటే దరఖాస్తుతోపాటు తప్పనిసరిగా పంపాల్సింది.. రెజ్యూమె. ఇది రంగాన్ని, ఉద్యోగాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. ఒకే ఫార్మాట్‌లోని రెజ్యూమె అన్ని రకాల కొలువులకు సరిపోదు. సాంకేతిక కొలువులకు దరఖాస్తు చేస్తే.. సంబంధిత రెజ్యూమెను జతచేయాలి. ఇది టెక్ ఫ్రెండ్లీగా ఉండాలి. టెక్నాలజీలో మీ అర్హతలు, అనుభవం, నైపుణ్యాలను రిక్రూటర్‌కు సరిగ్గా తెలియజేయాలి. టెక్ రెజ్యూమె అనేది మీకు తెలిసిన ప్రోగ్రామ్ లాంగ్వేజ్‌ల ద్వారా కంటే ఎక్కువగా మీ గురించి వెల్లడించాలి. ఇది సక్రమంగా ఉంటే సగం పని పూర్తయినట్లే. టెక్నాలజీ జాబ్స్‌పై ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ ప్రొఫెషనల్స్ టెక్ రెజ్యూమెపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి.  
 
 సాంకేతిక నైపుణ్యాలు: టెక్నాలజీ రెజ్యూమె రచనలో ఇతర విషయాల కంటే మీలోని టెక్నికల్ స్కిల్స్‌కే పెద్దపీట వేయాలి. వీటిని ప్రముఖంగా పేర్కొనాలి. హైరింగ్ మేనేజర్ మీ రెజ్యూమెను ఆసాంతం చదవలేరు. మొదట మీలోని సాంకేతిక నైపుణ్యాలనే పరిశీలిస్తారు. వాటిపట్ల సంతృప్తి చెందితేనే మిగిలిన అంశాలపై దృష్టి సారిస్తారు.
 
 అనుభవాలు: మీ అనుభవాలను క్లుప్తంగా 3, 4 లైన్లలో ప్రస్తావిస్తూ రెజ్యూమెను ప్రారంభించండి. తర్వాత వివిధ విభాగాల్లో మీ టెక్నికల్ స్కిల్స్‌ను విపులంగా పేర్కొనండి. ఉదాహరణకు..
 ఆపరేటింగ్ సిస్టమ్స్: విండోస్, యూనిక్స్, లైనక్స్
 లాంగ్వేజెస్: జావా, విజువల్ బేసిక్, సీ/సీ++, పెర్ల్
 డేటాబేస్: ఒరాకిల్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్
 నెట్‌వర్కింగ్: టీసీపీ/ఐపీ, లాన్/వాన్.
 
 మీ ప్రొఫైల్‌కు వర్తించే ప్రోగ్రామ్స్/అప్లికేషన్లను మాత్రమే ప్రస్తావించండి. తెలియని వాటిని కూడా పేర్కొంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలో పూర్తి ఆత్మవిశ్వాసంతో చర్చించగలిగే సాంకేతిక అంశాలనే రెజ్యూమెలో చేర్చండి. అంటే వాటిపై మీకు మంచి పరిజ్ఞానం ఉండాలి. అప్పుడే ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలుగుతారు. మీరు ఇప్పటికే ఒక సంస్థలో పనిచేసి ఉంటే అక్కడ సాధించిన విజయాలను కూడా పేర్కొనండి.
 
 కీలక పదాలు: ఐటీ రెజ్యూమెకు సరిగ్గా నప్పే సాంకేతిక పదాలు కొన్ని ఉంటాయి. వాటితో రెజ్యూమెకు నిండుదనం వస్తుంది. కాబట్టి ఆయా పదాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు.. యాక్టివేటెడ్, డిజైన్డ్, ఆర్గనైజ్డ్, అసిమిలేటెడ్, డెవలప్డ్, ఇనిషియేటెడ్, యుటిలైజ్డ్, డెమాన్‌స్ట్రేటెడ్, ఇన్‌స్టాల్డ్ వంటి పదాలను రెజ్యూమె రచనలో సందర్భానుసారంగా ఉపయోగించాలి.
 
 జూనియర్, సీనియర్: జూనియర్, సీనియర్ ప్రొఫెషనల్స్ రెజ్యూమె కంటెంట్ వేర్వేరుగా ఉంటుంది. అనుభవజ్ఞులు, అనుభవం లేనివారి అర్హతలు, నైపుణ్యాలు ఒకేలా ఉండవు. ఈ భేదాన్ని గుర్తించాలి. తొలిసారిగా టెక్ కెరీర్‌లోకి ప్రవేశించబోయేవారు రెజ్యూమెలో తమ స్కిల్స్, ప్రాజెక్ట్‌లపై ఎక్కువ ఫోకస్ చేయాలి.  
 
 జాబ్స్, అడ్మిషన్‌‌స అలర్‌‌ట్స
 సెంట్రల్ టూల్ రూమ్
 అండ్ ట్రైనింగ్ సెంటర్
 భువనేశ్వర్‌లోని సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
  సీనియర్ మేనేజర్ (ప్రొడక్షన్)
 అర్హతలు: మెకానికల్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఎనిమిదేళ్ల అనుభవం అవసరం.
  మేనేజర్ (ప్రొడక్షన్)
 అర్హతలు: టూల్ డిజైన్‌లో పీజీ లేదా పీజీ డిప్లొమా ఉండాలి. ఐదేళ్ల అనుభవం అవసరం.
  సీనియర్ ఇంజనీర్ (ప్రొడక్షన్)
 అర్హతలు: పీజీ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్/ ప్రొడక్షన్ లేదా క్యాడ్-క్యామ్ ఉండాలి.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31
 వెబ్‌సైట్:  www.cttc.gov.in
    ఎయిమ్స్
 న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది.
 పీజీ ప్రోగ్రాములు
  ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్
 విభాగాలు: క్లినికల్ సెన్సైస్, బేసిక్ క్లినికల్ సెన్సైస్, డెంటల్ మొదలైనవి.
  ఎంసీహెచ్
 విభాగాలు: న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ.
 అర్హతలు: ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉండాలి.
  మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
 అర్హతలు: ఎంబీబీఎస్ ఉండాలి.
  పీహెచ్‌డీ ప్రోగ్రామ్
 విభాగాలు: అనెస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బయోటెక్నాలజీ, సీటీసీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ల్యాబ్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెమటాలజీ, మైక్రోబయాలజీ, మెడికల్ అంకాలజీ మొదలైనవి.
 అర్హతలు: ఎంబీబీఎస్ ఉండాలి.
 ఎంపిక: ప్రవేశ పరీక్ష (ఆన్‌లైన్ టెస్ట్), డిపార్ట్‌మెంటల్ అసెస్‌మెంట్ ద్వారా.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 16
 వెబ్‌సైట్: www.aiimsexams.org
  జేవియర్ ఇన్‌స్టిట్యూట్
 ఆఫ్ మేనేజ్‌మెంట్
 భువనేశ్వర్‌లోని జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్  కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది.
  ఎంబీఏ ప్రోగ్రామ్
 విభాగాలు: బిజినెస్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, రూరల్ మేనేజ్‌మెంట్, సస్టెయినబిలిటీ మేనేజ్‌మెంట్, గ్లోబల్ మేనేజ్‌మెంట్ అండ్ లీడర్‌షిప్.
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. గ్జాట్/ క్యాట్/ జీమ్యాట్‌లో అర్హత సాధించాలి.
  ఎంబీఏ (ఎగ్జిక్యూటివ్)
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
  ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ (మేనేజ్‌మెంట్)
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
  పీహెచ్‌డీ (మేనేజ్‌మెంట్)
 అర్హతలు: ఎంబీఏ లేదా మేనేజ్‌మెంట్‌లో పీజీ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 5
 వెబ్‌సైట్: http://ximb.sify.net/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement