IT professionals
-
ఐటీలో కోతల కాలం!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగం.. ఒకప్పుడు ఉద్యోగార్థుల కలల ప్రపంచం.. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తే చాలు రెండు చేతులా సంపాదన, వీకెండ్ పార్టీలు, అప్పుడప్పుడూ టూర్లు. ఇక కరోనా వచ్చాక వర్క్ ఫ్రం హోం సౌలభ్యం. ఆ కలలన్నీ ఇప్పుడు సన్నగిల్లుతున్నాయి.. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం, రాజకీయ సంక్షోభం వంటి కారణాలతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఎడాపెడా తొలగించేస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే నెపంతో పింక్ స్లిప్ ఇచ్చేసి ఇంటికి పంపేస్తున్నాయి. ఇక కొత్తగా ప్లేస్‌మెంట్స్ ఇచ్చే విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఒకవేళ రిక్రూట్ చేసుకున్నా ఆఫర్ లెటర్ ఇవ్వడం లేదు. అన్ని కంపెనీలదీ అదే బాట.. కరోనా సంక్షోభం తర్వాత ఐటీ రంగంలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. 2022, 2023 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 వేల కంపెనీలు 4 లక్షల పైచిలుకు ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు https://layoffs.fyi అనే సంస్థ వెల్లడించింది. ఉద్యోగాల కోత 2024లోనూ కొనసాగుతోంది. 2024లోమే నాటికి 326 కంపెనీలు 98 వేల మందికి కత్తెరవేశాయి. పెద్ద కంపెనీలే కాదు స్టార్టప్స్ సైతం ఇదే బాట పట్టాయి. ఇక కొన్ని కంపెనీలైతే నష్టాలను భరించలేక ఏకంగా తమ కార్యకలాపాలను నిలిపేశాయి. డెల్ కంపెనీ గత ఏడాది 13వేల మందికి పింక్ స్లిప్ ఇవ్వగా, ఈ ఏడాది 6వేల మందిని సాగనంపింది. టెస్లా కంపెనీలో ఎలాన్ మస్క్ రాత్రికి రాత్రే తమ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు మెయిల్స్ పంపారు. దీంతో వందలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. మైక్రోసాఫ్ట్ 1,900 మందికి కోతపెట్టగా, తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయిన బైజూస్ 500 మందిని తొలగించింది. ఇంకా యాపిల్, డెల్, సోనీ, సిస్కో, స్విగ్గీ, యూట్యూబ్, గూగుల్, డుయోలింగో కంపెనీలు కూడా తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి. ఇన్నొవేషన్ వల్లేనా.. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్ (ఎంఎల్), ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని అందరూ భావించారు. వీటి వాడకం వల్లే ఉద్యోగాల్లో కోత పడుతోందని లేఆఫ్స్ సంస్థ విశ్లేషించింది. ఇన్నొవేషన్ మూలంగా ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. అయితే అందుకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగ భద్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉద్యోగుల పనితీరును అంచనా వేసిన తర్వాతే అడ్జస్ట్మెంట్లో భాగంగా కంపెనీలు ఉద్యోగాల్లో కోత పెడతాయని అంటున్నారు. మంచి పర్ఫార్మెన్స్ చూపించినా.. కంపెనీకి క్లయింట్స్ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తొలగించేస్తారు. ప్రాజెక్టులు లేకపోవడం కూడా ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. ఎంతగా పర్ఫార్మెన్స్ చూపించినా కూడా వారికి అవసరం లేకపోయినా.. బడ్జెట్ లేకపోయినా ఉద్వాసన పలుకుతారు. ఎప్పుడు ఉద్యోగం తొలగిస్తారోనన్న భయంతో ఉద్యోగం చేయాల్సి వస్తోంది. –మౌనిక, సాఫ్ట్వేర్ డెవలపర్, హైదరాబాద్ ఇద్దరి పని ఒక్కరిపైనే.. ఎజైల్ స్క్రమ్ మెథడాలజీ వ్యవస్థతో ఉద్యోగుల పనితీరును ప్రతి రోజూ అంచనా వేస్తుంటారు. ఇచి్చన టార్గెట్‌ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే అందుకు కారణాలను పై అధికారులకు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి రెండుసార్లు ఇలాగే జరిగితే చెప్పాపెట్టకుండా తొలగించేస్తారు. కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఇద్దరి ముగ్గురి పని కూడా ఒకరిపైనే వేసి.. మిగిలిన వారికి పింక్ స్లిప్ ఇస్తున్నారు. ఐటీ రంగం ఇప్పుడు అంత ఆశాజనకంగా లేదు. –పల్లె నరేశ్, ప్రిన్సిపల్ ఇంజనీర్ తప్పని పరిస్థితుల్లోనే.. కాస్త ఇబ్బందికరమే అయినా కంపెనీ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల పనితీరు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని లే ఆఫ్స్ ప్రకటిస్తుంటాం. ఆర్థిక మాంద్యం ప్రభావాలను తట్టుకోవడం మార్కెట్లో పోటీ, ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది. చాలా కంపెనీల్లో ఖాళీలు ఉన్నప్పటికీ నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత చాలా ఉంది. సాంకేతికతకు అనుగుణంగా ఉద్యోగులు కూడా నైపుణ్యాలు నేర్చుకోకపోతే ఉద్యోగాలు కోల్పోక తప్పని పరిస్థితి ఉంది. –కీర్తి రెడ్డి, బోల్డ్ ఫ్యూజ్ కంపెనీ సీఈవో, వ్యవస్థాపకురాలు -
ఐటీ ఉద్యోగులను మించిపోయిన చెఫ్‌లు.. ఎలాగో చూడండి..
యూకే ఇమ్మిగ్రేషన్ డేటా ఇటీవలి విశ్లేషణ ఊహించని పరిణామాన్ని వెల్లడించింది. కంప్యూటర్ ప్రోగ్రామర్ల కంటే చెఫ్‌ల వీసా దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. డిజిటల్ సూపర్ పవర్ గా ఎదగాలన్న తన ఆకాంక్షలకు ఊతమిచ్చేందుకు అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులను ఆకర్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అందుకు విరుద్ధంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2024 మార్చి వరకు 6,203 మంది చెఫ్‌లకు స్కిల్డ్ వర్కర్ వీసాలు మంజూరయ్యాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 54 శాతం అధికం. ఇదే సమయంలో ప్రోగ్రామర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లకు జారీ చేసిన వర్క్ పర్మిట్ల సంఖ్య 8,752 నుంచి 4,280కి పడిపోయింది. ఈ రెండు వృత్తులు ముఖ్యంగా భారతీయ వలసదారులలో ప్రాచుర్యం పొందాయి. యూకేలో భారతీయ రెస్టారెంట్ పరిశ్రమకి గణనీయమైన ఉనికి ఉంది.అయితే చెఫ్ వీసాల పెరుగుదల స్వల్పకాలికమే కావచ్చు. స్కిల్డ్ వర్కర్ వీసా నిబంధనల్లో మార్పులు చేయడం వల్ల యువ వర్కర్లకు కనీస వేతనం 38,700 పౌండ్లకు (సుమారు రూ.41 లక్షలు) పెరిగింది. 2023 ఏప్రిల్ నాటికి యూకేలో సగటు చెఫ్ జీతం 22,877 పౌండ్లు (సుమారు రూ.24 లక్షలు)గా ఉంది. చాలా రెస్టారెంట్లు కొత్త వేతన స్థాయిలను భరించే అవకాశం లేదు. దీంతో కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే దరఖాస్తుల హడావుడి పెరిగినట్లుగా తెలుస్తోంది.మరింత కఠినమైన ఆంక్షలు, అధిక వీసా ఫీజులను ప్రవేశపెట్టిన యూకే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో తాజా మార్పులను అధికారిక గణాంకాలు ఇంకా ప్రతిబింబించలేదు. 2023లో నికర వలసలు 10 శాతం తగ్గి 6,85,000 కు పడిపోవడం, వీసా దరఖాస్తులు తగ్గడంతో వలసలు తగ్గుముఖం పట్టాయని ప్రారంభ సూచికలు సూచిస్తున్నాయి. -
ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయ్..
ప్రపంచవ్యాప్తంగా కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయి. అంటే జీతాలు తగ్గిపోతున్నాయి. ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌ల ప్రకారం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులకు జీతం ఆఫర్లు 30 నుంచి 40 శాతం తగ్గాయి. అంతర్జాతీయ స్థూల ఆర్థిక మార్పులు, ఐటీ రంగం మందగమనం నేపథ్యంలో ఈ పతనం ఏడాది క్రితమే మొదలైందని పరిశ్రమలో ఉన్నతస్థాయి ఉద్యోగులు ఎకనామిక్ టైమ్స్‌తో చెప్పారు. కొన్ని పెద్ద టెక్ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవడానికి ప్రయత్నించడంతో కొన్ని నెలల క్రితం మార్పు ప్రారంభమైంది. 2021-2022లో కోవిడ్ మహమ్మారితో ఉద్యోగ నియామకాల స్తంభనకు దారితీసిన తర్వాత తక్కువ పే ప్యాకర్లు సాధారణంగా మారిపోయాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సిరీస్ A ఫండింగ్‌ని దాటిన ప్రారంభ దశ స్టార్టప్‌ల ద్వారానే చాలా వరకు నియామకాలు జరుగుతున్నాయని ఓ నిపుణుడు చెప్పినట్లుగా నివేదక పేర్కొంది. “ఐటీ కంపెనీలు మళ్లీ నియామకాలు ప్రారంభించాయి. అయితే మునుపటి సంవత్సరాల మాదిరిగా కాకుండా నియామకాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి" అని ఆ ఎక్స్పర్ట్ తెలిపారు. మంచి టెక్ టాలెంట్ ఉన్న చాలా మంది ప్రస్తుతం మార్కెట్లో వాస్తవిక వేతనాలతో అందుబాటులో ఉన్నారని, అలాంటి కొంతమంది నిపుణులను తాము నియమించుకుంటున్నట్లు ఐవీక్యాప్ వెంచర్స్ వ్యవస్థాపకుడు విక్రమ్ గుప్తా తెలిపారు. పెద్ద సంఖ్యలో సీనియర్ టెక్ టాలెంట్లను స్టార్టప్‌లు ఎంపిక చేసుకుంటున్నాయని కార్న్ ఫెర్రీ ఇండియా ఎండీ నవనిత్ సింగ్ చెబుతున్నారు. ఉద్వాసనకు గురైన, పెద్ద టెక్ కంపెనీలు, స్టార్టప్‌లతో కలిసి పనిచేసిన అభ్యర్థులతో తాము మాట్లాడుతున్నామని, వారు 30 శాతం వరకు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మైఖేల్ పేజ్ హెడ్, రీజినల్ డైరెక్టర్ ప్రన్షు ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. -
అమెరికాలో ఎన్నారై కుటుంబం దారుణ హత్య?!
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు హత్యకు గురయ్యారు. తేజ్ ప్రతాప్ సింగ్(43), సొనాల్ పరిహార్(42), వారి పదేళ్ల కొడుకు ఆయుష్, ఆరేళ్ల కూతురు ఆరీలు ప్లెయిన్స్‌బోరోలోని వారి సొంతింట్లోనే విగతజీవులై రక్తపు మడుగులో కనిపించారని పోలీసులు తెలిపారు. ఐటీ నిపుణులుగా పనిచేస్తున్న సింగ్ దంపతులు 2018లో సొంతింటిని కొనుక్కున్నారని బంధువులు తెలిపారు. ఈ నెల 4న సాయంత్రం తమ ఫోన్‌కాల్‌కు సింగ్ దంపతులు స్పందించడం లేదంటూ వారి బంధువొకరు అధికారులను అలర్ట్ చేశారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా విషయం బయటపడింది. బుధవారం రాత్రి వారు హత్యకు గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తేజ్ ప్రతాప్ సింగ్ సొంతూరు యూపీలోని జలౌన్ అని తెలిసింది. కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని ప్లెయిన్స్‌బోరో పోలీసులు తెలిపారు. -
‘సాఫ్ట్వేర్ ఉద్యోగమా..వద్దు బాబోయ్’, కంపెనీలకు షాకిస్తున్న ఐటీ ఉద్యోగులు!
ఐటీ - బీపీఎం ఇండస్ట్రీలో అట్రిషన్ రేటు రోజురోజుకి భారీ స్థాయిలో పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. 2025 నాటికి 22 లక్షల మంది ప్రొఫెషనల్స్ ఐటీ రంగానికి స్వస్తి చెప్పనున్నట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఐటీ ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో కంపెనీకి మారడం సాధారణమే. అయితే కోవిడ్ పరిణామాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు డిమాండ్ పెరగడంతో ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి అడుగు పెట్టే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వారిని నిలుపుకునేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నా, వేరే సంస్థలు ఇస్తున్న ఆఫర్లు నచ్చడంతో ఉద్యోగులు వెళ్లిపోతున్నారు. దీంతో కంపెనీలకు జీతభత్యాల పెరిగిపోవటం, ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాల్ని భర్తి చేసేందుకు భారీ ఎత్తున శాలరీలు అందించడం తలనొప్పిగా మారింది. అయినా అట్రిషన్ రేటు ఐటీ సంస్థల్ని తీవ్రంగా వేధిస్తోంది. ఈ తరుణంలో టీమ్ లీజ్ డిజిటల్ సంస్థ రానున్న సంవత్సరాల్లో ఐటీ ప్రొఫెషనల్స్ టెక్నాలజీ రంగాన్ని వదిలేస్తున్నారంటూ ఓ షాకింగ్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం..57 శాతం మంది నిపుణులు భవిష్యత్‌లో తిరిగి ఐటీ రంగంలో తిరిగి వచ్చే ఉద్దేశం తమకు లేదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సంప్రదాయ ఐటీ సంస్థల్ని వదిలేసే ఇతర రంగాల వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆ నివేదికలో తెలిపింది. ఐటీ ఉద్యోగానికి సెలవు దాదాపు 50 శాతం మంది ఉద్యోగులకు తమ పనికి తగిన ప్రతి ఫలం లేదనే అసంతృప్తిలో ఉన్నారని, 25 శాతం మంది కెరీర్ వృద్ధి లేకపోవడమే కారణమని అభిప్రాయపడ్డారు అట్రిషన్ రేటు 55 శాతం ఫైనాన్షియల్ ఇయర్ 2022లో ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల అట్రిషన్ రేటు 49శాతం ఉండగా, ఆర్ధిక సంవత్సరం 2023 నాటికి 55 శాతం పెరుగుతుందని టీమ్ లీజ్ విడుదల చేసిన ‘టాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్’లో హైలెట్ చేసింది. అంతేకాదు జీతం పెంపు పనితీరును మెరుగుపరుస్తుందని, ఉద్యోగ సంతృప్తిని పెంచుతుందని, 2025 నాటికి 20 లక్షల-22 లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదిలివేస్తారని వెల్లడించింది. చదవండి👉 ఉద్యోగులకు బంపరాఫర్.. రండి బాబు రండి మీకు భారీ ప్యాకేజీలిస్తాం! -
ఐటీ నిపుణులకు శుభవార్త: భారీ జీతాలు, ప్రోత్సాహకాలు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ కాలంలో ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్నాయి. తాజా అంచనాల ప్రకారం ఐటీనిపుణులు ఒక్కొక్కరికీ మూడు నుంచి నాలుగు ఆఫర్లు వస్తున్నాయట. అంతేకాదు 50-70 శాతం మంది జీతాల పెంపుతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కోవిడ్-19 కారణంగా డిజిటల్ నైపుణ్యాలకు డిమాండ్ భారీగా పుంజుకుందని రిక్రూటింగ్ సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఫుల్ స్టాక్ డెవలపర్లు, బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డెవలరపర్లు, క్లౌడ్ ఇంజనీర్లు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆటోమేషన్ అధిక డిమాండ్ ఉన్నవిభాగాలుగా రిక్రూటర్లు పేర్కొంటున్నారు. ఈ రంగాల్లో నియమాకాల్లో దాదాపు 30-35శాతం పెరుగుదల, 50-70 శాతం వరకు జీతాల పెంపు కనిపిస్తోందని తెలిపారు. గత ఏడాదిలాక్డౌన్ కారణంగా ఐటీ మినహా ఇతర రంగాల్లో లక్షలాదిమంది ఉపాధిని కోల్పోయారు. ఐటీరంగంలో డిజిటల్ రంగంలో ఉద్యోగాలకు భారీ డిమాండ్ పెరిగింది. ఐటీ డిజటల్ విభాగంగా బోలెడన్ని అవకాశాలున్నాయి.ఈ రంగంలో నిపుణులకు పెద్ద మొత్తంలో చెల్లించేందుకు ఐటీ కంపెనీలు సిద్ధంగా ఉన్నారని రాండ్‌స్టాడ్ ఇండియా యెషాబ్ గిరి అన్నారు.డిమాండ్ ఎక్కువ సరఫరా తక్కువ ఉన్న నేపథ్యంలో ప్రధాన ఐటీ సంస్థలమధ్య ప్రతిభావంతులకోపం పెద్ద పోటీ నెలకొందన్నారు. భారతీయ ఐటీ పరిశ్రమలో ప్రతిభావంతుల కోసం యుద్ధం జరుగుతోంది. ప్రధాన ఐటీ కంపెనీల క్యూ4 ఫలితాలు ఆదాయాలు, ఆట్రిషన్ (కంపెనీనుంచి వలసలు) భారీ ఒప్పందాలే దీనికి తార్కాణమని వెల్లడించారు. వారికి ఆకర్షణీయ జీతాలు, బోనస్‌లు ,ప్రోత్సాహకాలు భారీగా లభించనున్నాయని ఏబీసీ కన్సల్టింగ్ సీనియర్ డైరెక్టర్ (టెక్నాలజీ) రత్న గుప్తా అన్నారు. డ్రాప్-అవుట్ రేట్లు కూడా గణనీయంగా పెరిగింది. ప్రతి 10 జాబ్ ఆఫర్లకు, వాటిలో 4-5 ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. అంటే దాదాపు 40-50 శాతంగా ఉంది. దీంతో అభ్యర్థులను ఎంపిక చేయడం అటు కంపెనీలకు, ఇటు నియామక సంస్థలకు సవాలుగా మారిందని గిరి తెలిపారు. అట్రిషన్ రేటు ఐటీ మేజర్ టీసీఎస్‌లో 7.2 శాతంగా ఉండగా, తమవద్ద 15 శాతంగా ఉందని ఇన్ఫోసిస్ క్యూ 4 ఫలితాల సందర్భంగా తెలిపింది. రానున్న రెండు త్రైమాసికాలలో కూడా ఇది కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే విప్రో, 12.1 శాతం, హెచ్‌సిఎల్ టెక్ 9.9 శాతం అట్రిషన్‌ను నమోదు చేసింది, రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత పెరగవచ్చని అంచనా. గతేడాది అట్రిషన్ 10-12శాతం మాత్రమే. కాగా 2021-22లో లక్షకు పైగా ఫ్రెషర్లను తీసుకోనున్నామని టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో హెచ్‌సిఎల్ టెక్ ఇప్పటికే ప్రకటించాయి. -
ఐటీ కంపెనీలకు తాజా సవాల్ ఏంటంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒకవైపు ఊరిస్తున్న భారీ ఒప్పందాలు.. మరోవైపు నిపుణులైన మానవ వనరుల కొరత. ఇదీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల ప్రస్తుత పరిస్థితి. డీల్స్ స్థాయితో సిబ్బంది నైపుణ్యతను పోలిస్తే అసమతుల్యత ఏర్పడుతోంది. అట్రిషన్ కోవిడ్ ముందస్తు స్థాయికి 17-20 శాతానికి చేరవచ్చని నిపుణులు అంటున్నారు. సిబ్బంది ఉద్యోగాలు మారుతుండడమే ఇందుకు కారణం. మహమ్మారి నేపథ్యంలో ఆధునీకరణ, డిజిటల్ వైపు మార్కెట్ దూసుకెళ్తుండడంతో కంపెనీల వ్యయాలు పెరిగాయి. కోవిడ్ కారణంగా మందగించిన డిమాండ్‌ను అందుకోవడానికి సంస్థలు మరింత విస్తరిస్తున్నాయి. దీంతో డిజిటల్ నైపుణ్యాలు ఉన్న మానవ వనరుల కొరత యూఎస్, ఈయూతోపాటు ఇటీవల భారత్‌లోనూ చూస్తున్నట్టు రిసర్చ్ కంపెనీ ఎవరెస్ట్ గ్రూప్ చెబుతోంది. నిపుణుల వేట మొదలైంది.. కోవిడ్ సమయంలో సేవా సంస్థలు ఫ్రెషర్లతోపాటు ఇప్పటికే ఉన్న ఉద్యోగుల కోతల కారణంగా కొరత మరింత తీవ్రంగా మారింది. అయితే ఉద్యోగులకు నైపుణ్య శిక్షణపై ఐటీ కంపెనీలు ఇప్పటికే దృష్టిసారించాయి. సిబ్బందిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు వేట మొదలు పెట్టాయి. రానున్న రోజుల్లో డిజిటల్ నైపుణ్యాలతోపాటు ఇతర విభాగాల్లోనూ కొరత ఏర్పడుతుందని ఎవరెస్ట్ గ్రూప్ సీఈవో పీటర్ బెండోర్ సామ్యూల్ తెలిపారు. కొద్ది రోజుల్లో డిజిటల్ విభాగంలో అట్రిషన్ 7–8 శాతం ఉండొచ్చని టీమ్‌లీజ్ అంటోంది. నియామకాలు 15–16 శాతముంటాయని జోస్యం చెబుతోంది. భారీ డీల్స్ చేతుల్లోకి రానున్న నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టుగా నిపుణులు ఉండడం కంపెనీల పనితీరుకు నిదర్శనంగా నిలవనుంది. మంచి ఆఫర్స్ వస్తున్నాయి: అక్టోబరు నుంచి నియామకాలు పెరిగాయి. రిక్రూట్మెంట్ అంత క్రితంతో పోలిస్తే తక్కువే. ఉద్యోగులతో పనిచేయించుకోవడం మాత్రం గతంలో లేనంతగా ఉంది. అయితే ఇది స్థిరమైన విధానం కాదని అందరూ గుర్తించారని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్త వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు వ్యాపారం తిరిగి పుంజుకుంటుండడంతో ప్రస్తుత, రాబోయే ప్రాజెక్టుల కోసం ప్రతి కంపెనీ నియామకాలను చేపట్టాలని చూస్తున్నాయి. దీంతో నిపుణుల కోసం కంపెనీలు పోటీ పడతాయి. ప్రధానంగా డిజిటల్ విభాగంలో ఈ పరిస్థితి ఉంటుంది. డిజిటల్ నైపుణ్యం ఉన్న వారికి డిమాండ్ ఉంది. ఉత్తమ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి మార్చి త్రైమాసికంలో అట్రిషన్ పెరుగుతుంది’ అని వివరించారు. గూగుల్ కెరీర్ సర్టిఫికేట్స్ ఉన్న 500 మందిని రెండేళ్లలో నియమించుకోనున్నట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. నైపుణ్యం పొందేందుకు మార్కెట్లో వనరులు ఉన్నాయని ఎడ్వెన్సాఫ్ట్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి రామ్మూర్తి రెడ్డి తెలిపారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవ్వాల్సిదేనని అన్నారు. బలమైన వృద్ధి వైపు మార్కెట్: ఐటీ సేవల కంపెనీల 3వ త్రైమాసికం ఫలితాలతో తక్కువ వృద్ధి నుంచి రికవరీ అయిన సంకేతాలు కనపడ్డాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో తదితర సంస్థలు పెద్ద డీల్స్‌ను అందుకునే పనిలో ఉన్నాయి. యాక్సెంచర్ గణాంకాలు, ముందున్న డీల్స్ వెరశి 2021–22లో బలమైన వృద్ధి ఉండొచ్చని మార్కెట్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జీతాల పెంపుపై కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. 2021–22 సంవత్సరా నికి వేతనాలు పెంపును ఇప్పటికే టీసీఎస్ ప్రకటించింది. ఆరు నెలల్లో ఇది రెండవసారి కావడం గమనార్హం. ఉత్తమ పనితీరు కనబరిచేవారు సంస్థలో కొనసాగేలా కాగ్నిజెంట్ ప్రత్యేక బోనస్ ఇస్తోంది. ఒక వారం వేతనానికి సమానమైన బోనస్‌ను యాక్సెంచర్ ఆఫర్ చేసింది. -
ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్ : బైడెన్ తాజా నిర్ణయం
వాషింగ్టన్: భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో తీపి కబురు అందించారు. హెచ్-1బీ వీసాల వేతనాలకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేశారు. హెచ్-1బీ వీసాపై అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ ట్రంప్ సర్కారు గతంలో తెచ్చిన నిబంధన అమలును మరింత ఆలస్యం చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. కార్మిక శాఖ శుక్రవారం ప్రచురించిన ఫెడరల్ నోటిఫికేషన్లో, మే 14 వరకూ దీని అమలును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. తమ నిర్ణయం అమెరికాలోని కొంతమంది విదేశీయుల తాత్కాలిక, శాశ్వత ఉద్యోగుల వేతన ప్రయోజనాలను కాపాడనుందని తెలిపింది. ఫలితంగా భారతీయ ఐటీ నిపుణులకు కూడా భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న కాలపరిమితిని మరింత ఆలస్యం చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం ఇది మే 14 నుండి అమలులోకి రానుందని తెలిపింది. దీన్ని పొడిగించేముందు ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామని పేర్కొంది. కాగా అమెరికా సంస్థలపై విదేశీ ఉద్యోగుల వేతన భారం తగ్గడంతోపాటు, విదేశీ ఉద్యోగుల స్థానంలో అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయంటూ అప్పటి అధ్యక్షుడు ట్రంప్ తప్పనిసరి కనీస వేతననిబంధనను తీసుకొచ్చారు. దీనిపై ఇరువైపులా నిరసన భారీగానే వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బైడెన్ తాజా ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే బైడెన్ తాజా నిర్ణయాన్ని ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్(ఫెయిర్) సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. అమెరికా ఉద్యోగులు, సంస్థల భద్రత నిమిత్తం మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమలు నిలుపుదలతో కరోనా సంక్షోభంలో చిక్కుకున్న వారి పరిస్థితి మరింత క్షీణిస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం -
ఈ ఐటీ బాబులకు ఆదివారం సెలవు లేదు!
బంజారాహిల్స్ (హైదరాబాద్): పత్రికల్లో, టీవీల్లో రైతుల బాధలను నిత్యం చూస్తుంటాం. కానీ అయ్యో అని నిట్టూర్చకుండా హైదరాబాద్‌లోని కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ వంతు సాయం చేయాలని భావించారు. రైతుల నుంచి కూరగాయలు తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్మి, వచ్చిన డబ్బులను వారికే ఇస్తున్నారు. ఇందుకోసం 250 మంది సభ్యులుగా ఉన్న ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ (ఫర్ ఐటీ) రైతులకు అండగా ఉంటోంది. 2007లో ఏర్పడిన ఈ ఫర్ఐటీ.. తొలుత ఐటీ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసేది. ఆ తర్వాత సామాజిక బాధ్యత వైపు అడుగులు వేసింది. తాజాగా టమాటా రైతులకు గిట్టుబాటు ధర రాక.. కిలో టమాటా రెండు రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తోందని తెలుసుకున్న ఈ బృందం.. నల్లగొండలోని రైతులకు సాయం చేయాలని భావించింది. ఇందుకోసం రైతుల నుంచి టమాటాలు కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసి కూరగాయలు విక్రయిస్తున్నారు. వచ్చిన డబ్బులో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం డబ్బును రైతులకే అందజేస్తున్నారు. హైదరాబాద్‌లో 9 చోట్ల రైతు బజార్లు ఏర్పాటు చేసి కిలో టమాటాను రూ.15కు విక్రయిస్తున్నారు. ఇలా రెండు రూపాయలకే అమ్ముకునే రైతుకు ఏకంగా రూ.15 వచ్చేలా చేస్తున్నారు. టమాటా మాత్రమే కాకుండా నిమ్మకాయలు, పుచ్చకాయలు, సోరకాయలు, ఆకు కూరలు కూడా తెచ్చి అత్తాపూర్, మియాపూర్, గచ్చిబౌలీ, అలకాపురి కాలనీ, జేఎన్టీయూ, బీహెచ్ఈఎల్, రాజేంద్రనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో విక్రయించి రైతులకు బాసటగా నిలవడమే కాకుండా యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వీరి ప్రోత్సాహం మరవలేనిది నేను 6 ఎకరాల్లో టమాటా పంట వేశాను. గిట్టుబాటు లేకుండా పోయింది. ఆ సమయంలోనే హైదరాబాద్ నుంచి 30 మంది యువకులు వచ్చి నా టమాటాలను లారీల్లో తీసుకెళ్లి హైదరాబాద్‌లో కిలో రూ.15కు అమ్మి పెట్టారు. నాలాగే ఇంకా కొందరు రైతుల నుంచి కూడా కూరగాయలు తీసుకున్నారు. పైసా ఆదాయం లేకుండా రవాణా ఖర్చులు కూడా వారే భరించారు. – నాగమణి, రైతు మరిన్ని చోట్ల విక్రయిస్తాం లాక్డౌన్లో మా సభ్యులకు వచ్చిన ఆలోచన ఇది. చాలా చోట్ల ఎక్కువ ధరకు టమాటాలు, కూరగాయలు విక్రయిస్తున్నారని తెలుసుకొని రైతులకు ఉపయోగపడేలా మేమే వెళ్లి కూరగాయలు తీసుకొచ్చాం. మేం తె చ్చిన తాజా కూరగాయలు అందరికీ నచ్చాయి. అందుకే కూరగాయల బ జార్లు ఏర్పాటు చేసిన నాలుగైదు గం టల్లోనే అమ్ముడుపోయేవి. రాబోయే రోజుల్లో మరిన్ని చోట్ల విక్రయిస్తాం. – కిరణ్ చంద్ర, ఫర్ ఐటీ సంస్థ అధ్యక్షుడు రవాణా ఖర్చులు మేమే భరిస్తాం రైతుల నుంచి కూరగాయలు తీసుకొచ్చే క్రమంలో రవాణా ఖర్చులన్నీ మా సంస్థే భరించింది. గిట్టుబాటు ధరలేక రైతులు పడుతున్న ఇబ్బందులపై మేం చర్చించుకున్నాం. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాం. నల్లగొండ జిల్లా హాలియా, కట్టంగూర్ తదితర ప్రాంతాల్లో రైతుల నుంచి నేరుగా కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించాం. రైతుకు కూడా తగిన గిట్టుబాటు ధర లభించింది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తాం. – ప్రవీణ్ చంద్రహాస్, జనరల్ సెక్రటరీ ఫర్ ఐటీ -
హెచ్1 బీ వీసాలకు మళ్లీ ట్రంప్ షాక్
వాషింగ్టన్: దేశీ టెక్ నిపుణులు, ఐటీ కంపెనీలకు షాక్‌నిస్తూ హెచ్1 బీ వీసాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. వీటిపై గతేడాది విధించిన నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీసాల జారీకి మార్చి నెలాఖరువరకూ వీలుకాదని సంబంధితవర్గాలు తెలియజేశాయి. సుమారు 8 నెలలుగా హెచ్1 బీ, తదితర వర్క్ వీసాలపై ఆంక్షలను విధించిన ట్రంప్ తాజాగా మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకుగల కారణాలపై ట్రంప్ యథాప్రకారం పాత పల్లవినే ఎత్తుకున్నారు. కోవిడ్-19 వల్ల ఉపాధి మార్కెట్‌తోపాటు.. అమెరికా ప్రజల ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. కరోనా వైరస్ అమెరికన్ల జీవితాలకు విఘాతం కలిగిస్తున్నట్లు చెప్పారు. నవంబర్‌లో నిరుద్యోగిత 6.7 శాతంగా నమోదైన విషయాన్ని ప్రస్తావించారు. ఏప్రిల్‌లో నమోదైన గరిష్టంతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ ఇప్పటికీ పలువురు ఉపాధి కోల్పోతున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఉపాధి మార్కెట్, ప్రజా ఆరోగ్యాల విషయంలో పరిస్థితులు మెరుగుపడలేదని వివరించారు. చదవండి: (10 రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్లు) ఏప్రిల్ నుంచీ హెచ్1 బీ, తదితర వీసాల జారీపై ట్రంప్ 2019 ఏప్రిల్ 22న తొలిసారి నిలుపుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఆపై జూన్ 22న 6 నెలలపాటు నిషేధాన్ని పొడిగించారు. దీంతో డిసెంబర్ 31కల్లా గడువు ముగియనుండటంతో తాజాగా మరో మూడు నెలలు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మార్చి 31వరకూ నిషేధం అమలుకానుంది. ఫలితంగా భారీ సంఖ్యలో భారత ఐటీ నిపుణులు, పలు అమెరికన్, దేశీ సాఫ్ట్వేర్ సేవల కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడనుంది. 2021 ఏడాదికిగాను జారీ అయిన హెచ్1బీ వీసాలకు స్టాంపింగ్‌కు మార్చి నెలాఖరు వరకూ వేచిచూడవలసి ఉంటుందని విశ్లేషకులు తెలియజేశారు. యూఎస్‌లో పనిచేసేందుకు వీలుగా సాఫ్ట్వేర్ సేవల కంపెనీలు హెచ్1బీ వీసాల ద్వారా ఐటీ నిపుణులను ఎంపిక చేసుకునే సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జారీ అయ్యే హెచ్1బీ వీసాలను భారతీయులే అత్యధికంగా పొందుతుంటారు. కాగా.. ట్రంప్ తాజా నిర్ణయంతో ఇప్పటికే గడువు తీరిన హెచ్1బీ వీసాల రెన్యువల్ సైతం పెండింగ్‌లో పడనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. (కోవిడ్-19లోనూ దిగ్గజాల దూకుడు) -
హెచ్ 1బీ వీసా : ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారతీయ ఐటి నిపుణులకు మరోసారి షాక్ ఇచ్చింది. హెచ్ 1బీ వీసాల జారీలో కంప్యూటరైజ్డ్ లాటరీ పద్దతికి గుడ్ బై చెబుతూ మరో కీలక ప్రతిపాదన చేసింది. దీనిస్థానంలో వేతన స్థాయి ఆధారిత వీసాలు జారీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌పై 30 రోజుల్లోగా స్పందన తెలియజేయవచ్చుని అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ(డిహెచ్ఎస్) తెలిపింది. ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యత అంటూ ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న ట్రంప్ సర్కార్ తాజాగా లాటరీ పద్దతిన వీసాలు కేటాయించే పద్దతికి కూడా స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. లాటరీ విధానాన్ని రద్దు చేసి ఇకపై గరిష్ఠ వేతన స్థాయి వీసాల ద్వారా మెరుగైన వేతనాలను అందించేలా ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. భారత్ సహా, వివిధ దేశాలనుంచి ప్రతీ ఏడాది హెచ్ 1బీ వీసా కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తూ ఉంటాయి. వీటిలో కంప్యూటర్ లాటరీ ద్వారా 65 వేల మందిని ఎంపిక చేసి హెచ్1బీ వీసాలు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పద్దతిలో విదేశాలకు చెందిన అభ్యర్ధులు చౌకగా దొరుకుతుండడంతో అమెరికా యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతోందంటూ ట్రంప్ సర్కార్ వాదిస్తోంది. దీనికి బదులుగా ఎక్కువ నైపుణ్యం ఉండి, ఎక్కువ జీతాలకు పని చేసే ఉద్యోగులకు మాత్రమే హెచ్1బీ వీసాను జారీచేసేలా చర్యలు చేపట్టనుంది. -
వాళ్లను తిట్టడం ఫ్యాషనైపోయింది.. ఇది సరికాదు!
న్యూఢిల్లీ: కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలను ప్రదాని నరేంద్ర మోదీ మరోసారి సమర్ధించారు. కార్పొరేట్లు వ్యాపారంతో పాటు సామాజిక సేవ చేస్తున్నప్పటికీ.. వారిని తిట్టడం ఫ్యాషన్‌గా మారిందని మోదీ ఆక్షేపించారు. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. ఐటీ నిపుణులు, టెక్నాలజీ దిగ్గజాలతో బుధవారం చర్చాగోష్టిలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఐటీ, కార్పొరేట్ దిగ్గజాలు అత్యుత్తమంగా సామాజిక సేవ చేస్తుండటం, తమ ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తుండటం మనం చూస్తున్నాం. ఎందుకో తెలియదు కానీ మన దేశంలో వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను విమర్శిస్తుండటం సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదో ఫ్యాషన్‌గా మారింది. ఇది నాకు ఆమోదయోగ్యమైన విషయం కాదు’ అని మోదీ పేర్కొన్నారు. కార్పొరేట్లను మోదీ సమర్ధించడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. దేశాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు కూడా కీలకపాత్ర పోషించారని, వారితో కలిసి కనిపించడానికి తాను భయపడబోనని జూలైలో ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పన్నులు కట్టడమే కాదు.. సమాజ సేవా చేయాలి.. కేంద్రం ప్రజా ధనాన్ని సద్వినియోగం చేస్తోందన్న నమ్మకం కలగడం వల్లే తమ ప్రభుత్వ హయాంలో పన్నులు సక్రమంగా చెల్లించే వారి సంఖ్య పెరిగిందన్నారు. అయితే, సామాజిక బాధ్యత కింద నిజాయితీగా పన్నులు చెల్లించడంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం పౌరు లు తమ వంతుగా మరికాస్త పాటుపడాలని సూచించారు. ‘పన్నులు చెల్లించడమన్నది సహజసిద్ధమైన ప్రకృతి. కట్టకపోవడమన్నది వికృతి. కానీ పన్నులు సక్రమంగా కట్టడంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం మరికాస్త పాటుపడటమనేది సంస్కృతి‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు టెక్నాలజీపరమైన పరిష్కారమార్గాలు కనుగొనడంపై దృష్టి పెట్టాలని ఐటీ నిపుణులకు ప్రధాని సూచించారు. కాగా కొత్తగా ప్రారంభించిన సెల్ఫ్4సొసైటీకి ఐటీ దిగ్గజ కంపెనీలు మద్దతు తెలిపాయి. -
హెచ్-1బీపై కొత్త బిల్లు : భారతీయులకు ముప్పే!
బెంగళూరు : వార్షికంగా హెచ్-1బీ వీసాల కోటాను పెంచాలంటూ ఇద్దరు రిపబ్లికన్లు ఓ కొత్త బిల్లును అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు అమెరికన్ టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటివి మద్దతిచ్చాయి కూడా. అయితే అమెరికన్ దిగ్గజాలు సపోర్టు ఇచ్చిన ఈ బిల్లు భారతీయ ఐటీ కంపెనీలకు, భారత ఐటీ నిపుణులకు ఉపయోగకరమా? అంటే. అలాంటిదేమీ లేదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆరిన్ హాచ్, జెఫ్ఫ్ ఫ్లాక్ ప్రవేశపెట్టిన ''ది ఇమ్మిగ్రేషన్ ఇన్నోవేషన్ యాక్ట్-2018''లో హెచ్-1బీ వీసాల కోటాను ఏడాదికి 65వేల నుంచి 85వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో పాటు ఈ కొత్త బిల్లు హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్‌లో సంస్కరణలు కోరుతోంది. వీసా ఫీజులను పెంచి, ఆ నిధులను సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్ ఎడ్యుకేషన్ శిక్షణకు వాడాలంటూ ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లు కనుక పాస్ అయితే, దేశీయ ఐటీ సర్వీసెస్ కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బ అని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ వేతనం, మెదడుపై పనిభారాన్ని పెంచి, ముప్పు తెచ్చుస్తుందని పేర్కొంటున్నారు. సాధారణంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటి కంపెనీలు హెచ్-1బీ వీసాలతో లబ్ది పొందుతూ ఉంటాయని, కాబట్టి వారు మద్దతు ఇవ్వడం సాధారణమని చెప్పారు. అదే కనీసం వేతనం లక్ష డాలర్లకు పెంచితే, ఈ కంపెనీలు ప్రతిభావంతులను ఆకర్షించుకుంటాయని బెంగళూరుకు చెందిన గ్లోబల్ టెక్నాలజీ సంస్థల రిక్రూటర్ హెడ్ హంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో క్రిష్ లక్ష్మికాంత్ తెలిపారు. కానీ కనీస వేతనం పెంపుతో, దేశీయ ఐటీ కంపెనీలు టీసీఎస్, విప్రోల నుంచి అమెరికాకు వెళ్లే వారు తగ్గిపోతారని పేర్కొన్నారు. కంపెనీలు అక్కడే నియామకాలు చేపడతాయని చెప్పారు. దీంతో ఈ బిల్లు భారత్‌కు ఎంతమాత్రం మంచిది కాదని తెలిపారు. -
ఐటీ ఇండస్ట్రీ గుట్టు బయటపెడతాం!
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో నెలకొన్న సమస్యలపై ఐటీ నిపుణుల ఫోరం నేడు మీడియా సమావేశం నిర్వహించనుంది. ఐటీ పరిశ్రమలో అంతర్గతంగా జరుగుతున్న వివిధ అంశాలను బహిర్గతం చేయనున్నామని ఫోరం ఒక ప్రకటనలో తెలిపింది. ఐటీలో భయంకరమైన వాస్తవాలను, కట్టుకథలను వెల్లడించనున్నామని పేర్కొంది. దాదాపు 100 మంది ఐటీ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన బోతున్నారు. హైటెక్ సిటీలోని ఫోనిక్స్ ఎరినా సమీపంలో సాయంత్రం 4 గంటలకు ఈ ప్రెస్‌మీట్ ప్రారంభంకానుంది. ఐటీ ఇండస్ట్రీలో అసత్యాలు, ఉద్యోగుల అక్రమ తొలగింపులు, ప్యాకేజీ చెల్లింపులు తదితర అంశాల గురించి ఐటీ నిపుణులు మాట్లాడనున్నారు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా వేలాది మంది ఐటీ ఉద్యోగుల అక్రమ తొలగింపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఈ ఫోరం పనిచేస్తోంది. ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం హైకోర్టు, లేబర్ కమిషనర్ తదితర కార్యాలయాల్లో ఇప్పటికే వందలాది పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఐటీ ప్రొఫెషనల్స్‌కు రూ.4 లక్షల ఖర్చు
బెంగళూరు : ప్రస్తుతం ఐటీ రంగంలో కొత్త టెక్నాలజీల వల్ల తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ టెక్నాలజీల ప్రభావంతో ఐటీ ప్రొఫెషనల్స్ తమను తాము రీస్కిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటి కోసం ఐటీ ప్రొఫెషనల్స్ భారీ ఎత్తున ఖర్చు కూడా చేయాల్సి వస్తోంది. తాజా నివేదికల ప్రకారం మంచి స్థానాల్లోకి ఐటీ ప్రొఫెషనల్స్ వెళ్లాలంటే కొత్త టెక్నాలజీ కోర్సులను నేర్చుకోవాల్సి ఉందని, వీటి కోసం ఐటీ ప్రొఫెషనల్స్ రూ.4 లక్షల మేర ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిసింది. ఈ కోర్సులు కూడా ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రిలో 5-10 ఏళ్ల అనుభవమున్న ప్రొఫెషనల్స్‌లో ఎక్కువగా పాపులర్ అయినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ కోర్సుల వ్యవధి సాధారణంగా 10-12 నెలల ఉంటుందని, ఆన్లైన్ వీడియో క్లాస్‌లు, అసైన్మెంట్స్, టెస్ట్‌ల ద్వారా వీటిని నేర్చుకోవాల్సి ఉంటుందని తాజా నివేదికలు తెలిపాయి. చాలా కంపెనీలకు ఉద్యోగులను రీస్కిల్ చేయడానికి సమయం, అవకాశం లేదని ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ హెడ్‌హంటర్స్ ఇండియా వ్యవస్థాపకుడు క్రిష్ లక్ష్మికాంత్ తెలిపారు. ఈ కారణంతో చాలామంది మధ్యస్థాయి మేనేజర్లు తమకు తాముగా ఆన్లైన్ కోర్సులను నేర్చుకుంటూ, తమ ఉద్యోగాలను కాపాడుకుంటున్నారని లేదా మంచి మంచి స్థానాల్లోకి ప్లేస్ అవుతున్నట్టు చెప్పారు. కొత్త టెక్నాలజీ కోర్సులు నేర్చుకోవడం కోసం ఐటీ ప్రొఫెషనల్స్ రుణాలు కూడా తీసుకుంటున్నట్టు ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడర్ అప్‌గ్రాడ్ వ్యవస్థాపకుడు మయాంక్ కుమార్ పేర్కొన్నారు. ఐఎస్బీ లేదా ఇతర ఎంబీఏ కాలేజీల్లో ఏడాది కోర్సులు చేయడానికి రూ.6 లక్షలు ఖర్చు అవుతుందని, వాటితో పోల్చుకుంటే కొత్త టెక్నాలజీల కోసం పెట్టే ఖర్చు తక్కువేనని తెలిపారు. ప్రస్తుతం ఐటీలో మామూలు ఉద్యోగాలు కనుమరుగు అవుతున్నాయి. కొత్త టెక్నాలజీలకే ఐటీ సంస్థలు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాయి. డేటా అనాలిటిక్స్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త టెక్నాలజీకే ప్రస్తుతం ఉద్యోగ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు కూడా కొత్త టెక్నాలజీల కోర్సులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. చెన్నైకు చెందిన మేనేజ్మెంట్ కాలేజీ గ్రేట్ లీక్స్ ఇన్స్టిట్యూట్, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ గ్రేట్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ను లాంచ్ చేసింది. ఈ ఇన్స్టిట్యూట్ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు బిగ్‌డేటా, బిజినెస్ అనాలిటిక్స్ను ఆఫర్ చేస్తోంది. వీటికి ఒక్కో దానికి రూ.4 లక్షల మేర ఖర్చు అవుతుందని తెలిసింది. ఇన్స్టిట్యూట్లు ఆఫర్ చేసే సర్టిఫికేషన్ కోర్సులు కొత్తగా ఉద్యోగం దరఖాస్తు చేసుకోవడానికి సాయపడతాయని, డేటా సైన్సులో ఉద్యోగం పొందితే కనీసం 40 శాతం వేతనం పెంపు ఉంటుందని కాగ్నిజెంట్‌కు చెందిన ఓ ఉద్యోగి పేర్కొన్నారు. అదేవిధంగా ఇతర మీ స్కిల్స్, ప్రొఫైల్ బట్టి కూడా వేతనం ఉంటుందని చెప్పారు. -
ఐటీ నిపుణులకు ఇదిగో లక్ష కోట్ల సెక్టార్
ఏ క్షణాన కంపెనీలు ఎలాంటి పిడుగు లాంటి వార్తను తమ చెవిన వేయనున్నాయోనని ఆందోళన చెందుతున్న ఐటీ నిపుణులకు ఓ అపూర్వ అవకాశం మార్కెట్లోకి వచ్చేసింది. ఐటీ పరిశ్రమలో భారీ ఎత్తున్న ఉద్యోగవకాశాలు కల్పించడానికి బిగ్ డేటా అనాలిటిక్స్ రంగంలోకి వచ్చేసిందని ఇండస్ట్రి నిపుణులు చెప్పారు. వచ్చే 2025 కల్లా ఈ రంగం ఎనిమిదింతల వృద్ధి సాధించనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం 2 బిలియన్ డాలర్లుగా ఉన్న బిగ్ డేటా అనాలిటిక్స్ రంగం వృద్ధి వచ్చే ఏళ్లలో 16 బిలియన్ డాలర్లకు(రూ.లక్ష కోట్లకు) ఎగయనుందని ఇండస్ట్రి నిపుణులు తెలిపారు. ప్రస్తుతం బిగ్ డేటా అనాలిటిక్స్‌లో భారత్, ప్రపంచంలో టాప్10లో ఉన్నట్టు తెలిసింది. వచ్చే మూడేళ్లలో ఈ రంగంలో భారత్‌ను టాప్-3లో నిలపాలని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ టార్గెట్‌గా పెట్టుకుంది. బిగ్‌డేటా అనాలిటిక్స్‌లో ఎనిమిది స్పెషలైజేషన్స్‌లో ఎక్కువగా వృద్ధి ఉన్నట్టు నాస్కామ్ గుర్తించింది. అవి బిజినెస్ అనాలిస్టులు, సొల్యుషన్ అర్కిటెక్ట్స్, డేటా ఇంటిగ్రేటర్లు, డేటా ఆర్కిటెక్ట్స్, డేటా అనాలిస్టులు, డేటా సైంటిస్టులుగా నాస్కామ్ పేర్కొంది. నాస్కామ్ ప్రకారం అనాలిటిక్స్ ఎగుమతుల మార్కెట్ 2017లో కనీసం 20 శాతం వృద్ది సాధించనున్నట్టు వెల్లడైంది. ఇది మొత్తం ఐటీ ఎగుమతుల కంటే కూడా అత్యధికమని నాస్కామ్ పేర్కొంది. భారీ ఎత్తున్న వృద్ధి ఉద్యోగవకాశాలను కూడా ఈ రంగం సృష్టించనుందని అనాలిటిక్స్ ఇండియా మేగజీన్ అధ్యయనం తెలిపింది. గత ఏడాది కాలంలో దీనిలో ఉద్యోగాల రెండింతలయ్యాయని వెల్లడించింది. ప్రస్తుతం 50వేల పొజిషన్లు అనాలిటిక్స్‌కు సంబంధించినవే ఉన్నాయని అనాలిటిక్స్ అండ్ డేటా సైన్సు ఇండియా జాబ్స్ స్టడీ 2017 అంచనావేసింది. -
కాగ్నిజెంట్‌పై పోరుకు సై అన్న ఉద్యోగులు
చెన్నై: భారీగా ఉద్యోగుల తొలగింపులపై ఐటీ ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ప్రముఖ ఐటీసేవల సంస్థ కాగ్నిజెంట్ సీనియర్ స్థాయి టెకీలపై వేటు వేస్తున్న నేపథ్యంలో రెండు గ్రూపులు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. ఫోరమ్ ఆఫ్ ఐటి ఎంప్లాయీస్ (ఫైట్), ఎన్డీఎల్ఎఫ్ ఐటి ఉద్యోగుల వింగ్ ఈ తొలగింపులకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశాయి. పెర్ఫామెన్స్ఆధారంగా కాగ్నిజెంట్ ఉద్యోగులపై వేటు వేస్తున్న ధోరణినుంచి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రయోజనాలను కాపాడాలంటూ రాష్ట్ర కార్మికశాఖ వద్ద ఈ పిటిషన్ దాఖలు చేశాయి. అయితే పెర్ఫామెన్స్ ఆధారంగా ఉద్యోగులను తొలగిస్తున్నారన్న ఆరోపణలను కాగ్నిజెంట్ తిరస్కరించింది. తక్కువ నైపుణ్య ప్రదర్శన కారణంగా ఉద్యోగులే కొంతమంది సంస్థను వీడుతున్నట్టు ప్రకటించింది. "కాగ్నిజెంట్ ఏ తొలగింపులను నిర్వహించలేదు. ప్రతి సంవత్సరం, మా పరిశ్రమ అంతటా ఉత్తమ సాధనంగా, మేము క్లయింట్ అవసరాలను తీర్చడానికి , మా వ్యాపార లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉద్యోగి నైపుణ్యం ఉన్నట్లు నిర్ధారించడానికి మేము ఒక సమీక్షను నిర్వహిస్తాం. ఈ ప్రక్రియ కంపెనీల నుంచి మార్పు చెందుతున్న కొంతమంది ఉద్యోగులతో సహా మార్పులకు దారితీస్తుంది "అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. న్యూ డెమోక్రటిక్ లేబర్ ఫ్రంట్ (ఎన్డీఎల్ఎఫ్) కు అనుబంధంగా పనిచేస్తున్న ఎన్డీఎల్ఎఫ్ ఐటి ఎంప్లాయీస్ వింగ్, ఇతర రాష్ట్రాల్లో యూనియన్లను స్థాపించాలని భావిస్తున్నట్టు తెలిపారు. వివిధ కంపెనీల నుంచి దాదాపు 100 ఫిర్యాదులు అందుతున్నాయని ఆరోపించింది. ఉద్యోగుల అక్రమ తొలగింపులపై ఆయా రాష్ట్రాల కార్మిక శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. తమ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి రాష్ట్రంలో యూనియన్ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నామని అని యూనియన్‌కు చెందిన కుమార్ ఎస్ అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్డిఎల్ఎఫ్ ఐటి ఉద్యోగుల విభాగం ఉందని కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణాలకు విస్తరణ ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. -
70 శాతం టెక్కీలు అప్ గ్రేడ్ కాలేరు!
బెంగళూరు : ఇప్పటికే ఐటీ ప్రొఫిషనల్స్ పై పలు ఆసక్తికర సర్వేలు వెలువడుతుండగా... తాజాగా మరో ఆందోళనకర రిపోర్టు వెల్లడైంది. ఐటీ ఇండస్ట్రీలో భారీగా డిమాండ్ ఉన్న డేటా సైంటిస్టులు, సాప్ట్ వేర్ ఆర్కిటెక్ట్స్, డేటా ఇంజనీర్లు, యూఐ(యూజర్ ఇంటర్ ఫేస్), యూఎక్స్(యూజర్ ఎక్స్ పీరియెన్స్)లను నియమించుకోవడం కంపెనీలకు క్లిష్టతరమని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. అదేవిధంగా ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్న 70 శాతం ఐటీ ప్రొఫిషినల్స్ ఈ కొత్త స్కిల్స్ కు అప్ గ్రేడ్ కాలేరని తేల్చాయి. 100కి పైగా రెజ్యూమ్ లు కంపెనీలకు వస్తుండగా.. వారిలో 3,4 మంది మాత్రమే ఈ స్కిల్స్ కు తగ్గట్టు ఉంటున్నారని తెలిసింది. ఈ స్కిల్స్ కలిగిన చురుకైన అభ్యర్థులు డిమాండ్ కంటే సగానికి తక్కువగా ఉన్నారని సర్వేలు పేర్కొన్నాయి. అన్ని ఇండస్ట్రీల్లో ఈ పొజిషన్లకు డిమాండ్ ఉంటుందని, కానీ ఐటీ సెక్టార్ లో వీటికి మెజార్టీ డిమాండ్ ఉందని ఆన్ లైన్ రిక్రూట్ మెంట్ సంస్థ బెలాంగ్ తెలిపింది. నౌకరి, గ్లాస్ డోర్, కామ్ స్కోర్, గూగుల్ ట్రెండ్స్, నాస్కామ్, గిట్ హబ్, ట్విట్టర్ వంటి రిక్రూట్ మెంట్ కంపెనీల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ సర్వేను వెలువరించింది. జావా డెవలపర్, ఆటోకాడ్, మైక్రోకంట్రోలర్ ప్రొగ్రామింగ్, సొల్యుషన్ ఆర్కిటెక్ట్ వంటి కొన్ని స్కిల్స్ లో డిమాండ్ మించిపోయి, సప్లై ఉండగా.. డేటా ఇంజనీర్లు, సాప్ట్ వేర్ ఆర్కిటెక్ట్స్, డేటా సైంటిస్టులు తక్కువగా లభ్యమవుతున్నారని సర్వేల్లో తెలిసింది. వచ్చే 5-7 ఏళ్లలో ఈ విభాగాల్లో కంపెనీలు నియామకాలు చేపట్టకపోతే, కంపెనీలు డైనోసర్లుగా కనుమరుగయ్యే అవకాశముందని హ్యాకర్ ర్యాంక్స్ కో-ఫౌండర్, సీఈవో హరిశంకర్ కరుణానిధి చెప్పారు. ఈ స్కిల్స్ లో నైపుణ్యవంతమైన అభ్యర్థులను పొందడంలో కంపెనీలు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్న వారిలో 70 శాతం మంది ఈ స్కిల్స్ కు అప్ గ్రేడ్ కాలేరని రిక్రూట్ మెంట్ సంస్థ హెడ్ హంటర్స్ ఇండియా సీఈవో, క్రిష్ లక్ష్మికాంత్ తెలిపారు. ఏఐ, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఇతర పొజిషన్స్ లో సప్లైకి మించి డిమాండ్ ఉందన్నారు. ఈ కొత్త కోర్సులను కూడా చాలా కాలేజీలు తమ సిలబస్ లో చేర్చడం లేదని రిక్రూట్ మెంట్ సంస్థలు ఆందోళన వ్యక్తంచేశాయి. స్వతంత్ర ప్లాట్ ఫామ్స్ పై సర్టిఫికేట్ కోర్సు చేసిన వారి ఆధారంగానే ఖాళీలను నింపుతున్నామని చెప్పారు. ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ గా చాలా కాలేజీల్లో జావానే ఉందని హ్యకర్ ర్యాంక్స్ కరుణానిధి తెలిపారు. దీంతో చాలా ఏరియాలో అభ్యర్థులు దొరకడం లేదన్నారు. సప్లైకి మించి డిమాండ్ ఉంటే, సాధారణంగా రేట్లు పెరిగిపోతాయి, అదేమాదిరిగా రెగ్యులర్ సాప్ట్ వేర్ డెవలపర్ ఆర్జించే కంటే ఎక్కువగా ఈ ఉద్యోగాలు చేసే వారు 2535 శాతం పరిహారాలు పొందుతున్నారని ఎగ్జిక్యూటివ్ యాక్సెస్ సంస్థ ఎండీ రోణేష్ పురి తెలిపారు. -
ఢిల్లీలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
టెక్ రెజ్యూమె రూపొందించేదెలా?
కొలువు కావాలంటే దరఖాస్తుతోపాటు తప్పనిసరిగా పంపాల్సింది.. రెజ్యూమె. ఇది రంగాన్ని, ఉద్యోగాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. ఒకే ఫార్మాట్లోని రెజ్యూమె అన్ని రకాల కొలువులకు సరిపోదు. సాంకేతిక కొలువులకు దరఖాస్తు చేస్తే.. సంబంధిత రెజ్యూమెను జతచేయాలి. ఇది టెక్ ఫ్రెండ్లీగా ఉండాలి. టెక్నాలజీలో మీ అర్హతలు, అనుభవం, నైపుణ్యాలను రిక్రూటర్‌కు సరిగ్గా తెలియజేయాలి. టెక్ రెజ్యూమె అనేది మీకు తెలిసిన ప్రోగ్రామ్ లాంగ్వేజ్ల ద్వారా కంటే ఎక్కువగా మీ గురించి వెల్లడించాలి. ఇది సక్రమంగా ఉంటే సగం పని పూర్తయినట్లే. టెక్నాలజీ జాబ్స్‌పై ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ ప్రొఫెషనల్స్ టెక్ రెజ్యూమెపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. సాంకేతిక నైపుణ్యాలు: టెక్నాలజీ రెజ్యూమె రచనలో ఇతర విషయాల కంటే మీలోని టెక్నికల్ స్కిల్స్‌కే పెద్దపీట వేయాలి. వీటిని ప్రముఖంగా పేర్కొనాలి. హైరింగ్ మేనేజర్ మీ రెజ్యూమెను ఆసాంతం చదవలేరు. మొదట మీలోని సాంకేతిక నైపుణ్యాలనే పరిశీలిస్తారు. వాటిపట్ల సంతృప్తి చెందితేనే మిగిలిన అంశాలపై దృష్టి సారిస్తారు. అనుభవాలు: మీ అనుభవాలను క్లుప్తంగా 3, 4 లైన్లలో ప్రస్తావిస్తూ రెజ్యూమెను ప్రారంభించండి. తర్వాత వివిధ విభాగాల్లో మీ టెక్నికల్ స్కిల్స్‌ను విపులంగా పేర్కొనండి. ఉదాహరణకు.. ఆపరేటింగ్ సిస్టమ్స్: విండోస్, యూనిక్స్, లైనక్స్ లాంగ్వేజెస్: జావా, విజువల్ బేసిక్, సీ/సీ++, పెర్ల్ డేటాబేస్: ఒరాకిల్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ నెట్వర్కింగ్: టీసీపీ/ఐపీ, లాన్/వాన్. మీ ప్రొఫైల్‌కు వర్తించే ప్రోగ్రామ్స్/అప్లికేషన్లను మాత్రమే ప్రస్తావించండి. తెలియని వాటిని కూడా పేర్కొంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలో పూర్తి ఆత్మవిశ్వాసంతో చర్చించగలిగే సాంకేతిక అంశాలనే రెజ్యూమెలో చేర్చండి. అంటే వాటిపై మీకు మంచి పరిజ్ఞానం ఉండాలి. అప్పుడే ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలుగుతారు. మీరు ఇప్పటికే ఒక సంస్థలో పనిచేసి ఉంటే అక్కడ సాధించిన విజయాలను కూడా పేర్కొనండి. కీలక పదాలు: ఐటీ రెజ్యూమెకు సరిగ్గా నప్పే సాంకేతిక పదాలు కొన్ని ఉంటాయి. వాటితో రెజ్యూమెకు నిండుదనం వస్తుంది. కాబట్టి ఆయా పదాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు.. యాక్టివేటెడ్, డిజైన్డ్, ఆర్గనైజ్డ్, అసిమిలేటెడ్, డెవలప్డ్, ఇనిషియేటెడ్, యుటిలైజ్డ్, డెమాన్స్ట్రేటెడ్, ఇన్స్టాల్డ్ వంటి పదాలను రెజ్యూమె రచనలో సందర్భానుసారంగా ఉపయోగించాలి. జూనియర్, సీనియర్: జూనియర్, సీనియర్ ప్రొఫెషనల్స్ రెజ్యూమె కంటెంట్ వేర్వేరుగా ఉంటుంది. అనుభవజ్ఞులు, అనుభవం లేనివారి అర్హతలు, నైపుణ్యాలు ఒకేలా ఉండవు. ఈ భేదాన్ని గుర్తించాలి. తొలిసారిగా టెక్ కెరీర్లోకి ప్రవేశించబోయేవారు రెజ్యూమెలో తమ స్కిల్స్, ప్రాజెక్ట్‌లపై ఎక్కువ ఫోకస్ చేయాలి. జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ భువనేశ్వర్‌లోని సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. సీనియర్ మేనేజర్ (ప్రొడక్షన్) అర్హతలు: మెకానికల్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఎనిమిదేళ్ల అనుభవం అవసరం. మేనేజర్ (ప్రొడక్షన్) అర్హతలు: టూల్ డిజైన్‌లో పీజీ లేదా పీజీ డిప్లొమా ఉండాలి. ఐదేళ్ల అనుభవం అవసరం. సీనియర్ ఇంజనీర్ (ప్రొడక్షన్) అర్హతలు: పీజీ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్/ ప్రొడక్షన్ లేదా క్యాడ్-క్యామ్ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31 వెబ్సైట్: www.cttc.gov.in ఎయిమ్స్ న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. పీజీ ప్రోగ్రాములు ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్ విభాగాలు: క్లినికల్ సెన్సైస్, బేసిక్ క్లినికల్ సెన్సైస్, డెంటల్ మొదలైనవి. ఎంసీహెచ్ విభాగాలు: న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ. అర్హతలు: ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉండాలి. మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అర్హతలు: ఎంబీబీఎస్ ఉండాలి. పీహెచ్డీ ప్రోగ్రామ్ విభాగాలు: అనెస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బయోటెక్నాలజీ, సీటీసీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ల్యాబ్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెమటాలజీ, మైక్రోబయాలజీ, మెడికల్ అంకాలజీ మొదలైనవి. అర్హతలు: ఎంబీబీఎస్ ఉండాలి. ఎంపిక: ప్రవేశ పరీక్ష (ఆన్లైన్ టెస్ట్), డిపార్ట్మెంటల్ అసెస్మెంట్ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 16 వెబ్సైట్: www.aiimsexams.org జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ భువనేశ్వర్‌లోని జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. ఎంబీఏ ప్రోగ్రామ్ విభాగాలు: బిజినెస్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, రూరల్ మేనేజ్మెంట్, సస్టెయినబిలిటీ మేనేజ్మెంట్, గ్లోబల్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్. అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. గ్జాట్/ క్యాట్/ జీమ్యాట్‌లో అర్హత సాధించాలి. ఎంబీఏ (ఎగ్జిక్యూటివ్) అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ (మేనేజ్మెంట్) అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. పీహెచ్డీ (మేనేజ్మెంట్) అర్హతలు: ఎంబీఏ లేదా మేనేజ్మెంట్లో పీజీ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 5 వెబ్సైట్: http://ximb.sify.net/ -
బ్యాడ్‌యూఎస్‌బీ.. మహా మొండి వైరస్!
హ్యాకర్లు ఇప్పటిదాకా రకరకాల కంప్యూటర్ వైరస్‌లను వ్యాప్తి చేశారు. ఐటీ నిపుణులు వాటిని తొలగించే సాఫ్ట్వేర్లనూ తయారు చేశారు. అయితే.. ఎలాంటి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లూ గుర్తించలేని, దాదాపుగా గుర్తించినా తొలగించలేని ఓ ప్రమాదకర వైరస్ ఇప్పుడు యూఎస్బీ డ్రైవ్‌ల ద్వారా వ్యాప్తి చెందుతోందట. ‘బ్యాడ్‌యూఎస్‌బీ’ అనే ఈ మాల్వేర్ ఒక్కసారి యూఎస్బీ డ్రైవ్‌కు ఇన్ఫెక్ట్ అయిందంటే చాలు.. డ్రైవ్‌ను కనెక్ట్ చేసిన ప్రతిసారీ కంప్యూటర్, ల్యాప్‌టాప్ వంటి అన్ని పరికరాల్లోకీ చేరిపోతుందని, గుర్తుతెలియని ప్రోగ్రామ్‌ను వాటిలో రన్ చేసి ఆ కంప్యూటర్లను హ్యాకర్లు ఆన్లైన్లో నియంత్రణలోకి తీసుకునేందుకు తోడ్పడుతుందని బెర్లిన్‌కు చెందిన సెక్యూరిటీ రీసెర్చ్ ల్యాబ్స్ పరిశోధకులు చెబుతున్నా రు. కంప్యూటర్లోకి బ్యాడ్‌యూఎస్‌బీ మాల్వేర్ ప్రవేశిస్తే గనక .. ఆపరేటింగ్ సిస్టమ్‌ను రీఇన్‌స్టాల్ చేసుకోవడంతోపాటు అన్ని యూఎస్బీ పరికరాలనూ మార్చుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.