70 శాతం టెక్కీలు అప్ గ్రేడ్ కాలేరు! | 70% IT professionals can't upgrade to new skills: Report | Sakshi
Sakshi News home page

70 శాతం టెక్కీలు అప్ గ్రేడ్ కాలేరు!

Published Thu, May 4 2017 7:30 PM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM

70 శాతం టెక్కీలు అప్ గ్రేడ్ కాలేరు!

70 శాతం టెక్కీలు అప్ గ్రేడ్ కాలేరు!

బెంగళూరు : ఇప్పటికే ఐటీ ప్రొఫిషనల్స్ పై పలు ఆసక్తికర సర్వేలు వెలువడుతుండగా... తాజాగా మరో ఆందోళనకర రిపోర్టు వెల్లడైంది. ఐటీ ఇండస్ట్రీలో భారీగా డిమాండ్ ఉన్న డేటా సైంటిస్టులు, సాప్ట్ వేర్ ఆర్కిటెక్ట్స్, డేటా ఇంజనీర్లు, యూఐ(యూజర్ ఇంటర్ ఫేస్), యూఎక్స్(యూజర్ ఎక్స్ పీరియెన్స్)లను నియమించుకోవడం కంపెనీలకు క్లిష్టతరమని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. అదేవిధంగా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న 70 శాతం ఐటీ ప్రొఫిషినల్స్  ఈ కొత్త స్కిల్స్ కు అప్ గ్రేడ్ కాలేరని తేల్చాయి. 100కి పైగా రెజ్యూమ్ లు కంపెనీలకు వస్తుండగా.. వారిలో 3,4 మంది మాత్రమే ఈ స్కిల్స్ కు తగ్గట్టు ఉంటున్నారని తెలిసింది. ఈ స్కిల్స్ కలిగిన చురుకైన అభ్యర్థులు డిమాండ్ కంటే సగానికి తక్కువగా ఉన్నారని సర్వేలు పేర్కొన్నాయి. అన్ని ఇండస్ట్రీల్లో ఈ పొజిషన్లకు డిమాండ్ ఉంటుందని, కానీ ఐటీ సెక్టార్ లో వీటికి మెజార్టీ డిమాండ్ ఉందని ఆన్ లైన్ రిక్రూట్ మెంట్ సంస్థ బెలాంగ్ తెలిపింది. 
 
నౌకరి, గ్లాస్ డోర్, కామ్ స్కోర్, గూగుల్ ట్రెండ్స్, నాస్కామ్, గిట్ హబ్, ట్విట్టర్ వంటి రిక్రూట్ మెంట్ కంపెనీల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ సర్వేను వెలువరించింది. జావా డెవలపర్, ఆటోకాడ్, మైక్రోకంట్రోలర్ ప్రొగ్రామింగ్, సొల్యుషన్ ఆర్కిటెక్ట్ వంటి  కొన్ని స్కిల్స్ లో డిమాండ్ మించిపోయి, సప్లై ఉండగా.. డేటా ఇంజనీర్లు, సాప్ట్ వేర్ ఆర్కిటెక్ట్స్, డేటా సైంటిస్టులు తక్కువగా లభ్యమవుతున్నారని సర్వేల్లో తెలిసింది. వచ్చే 5-7 ఏళ్లలో ఈ విభాగాల్లో కంపెనీలు నియామకాలు చేపట్టకపోతే, కంపెనీలు డైనోసర్లుగా కనుమరుగయ్యే అవకాశముందని హ్యాకర్ ర్యాంక్స్ కో-ఫౌండర్, సీఈవో హరిశంకర్ కరుణానిధి చెప్పారు. ఈ స్కిల్స్ లో నైపుణ్యవంతమైన అభ్యర్థులను పొందడంలో కంపెనీలు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
 
ప్రస్తుతం ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వారిలో 70 శాతం మంది ఈ స్కిల్స్ కు అప్ గ్రేడ్ కాలేరని రిక్రూట్ మెంట్ సంస్థ హెడ్ హంటర్స్ ఇండియా సీఈవో, క్రిష్ లక్ష్మికాంత్ తెలిపారు. ఏఐ, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఇతర పొజిషన్స్ లో సప్లైకి మించి డిమాండ్ ఉందన్నారు. ఈ కొత్త కోర్సులను కూడా చాలా కాలేజీలు తమ సిలబస్ లో చేర్చడం లేదని రిక్రూట్ మెంట్ సంస్థలు ఆందోళన వ్యక్తంచేశాయి.  స్వతంత్ర ప్లాట్ ఫామ్స్ పై సర్టిఫికేట్ కోర్సు చేసిన వారి ఆధారంగానే ఖాళీలను నింపుతున్నామని చెప్పారు. ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ గా చాలా కాలేజీల్లో జావానే ఉందని హ్యకర్ ర్యాంక్స్ కరుణానిధి తెలిపారు. దీంతో చాలా ఏరియాలో అభ్యర్థులు దొరకడం లేదన్నారు. సప్లైకి మించి డిమాండ్ ఉంటే, సాధారణంగా రేట్లు పెరిగిపోతాయి, అదేమాదిరిగా రెగ్యులర్ సాప్ట్ వేర్ డెవలపర్ ఆర్జించే కంటే ఎక్కువగా ఈ ఉద్యోగాలు చేసే వారు 2535 శాతం పరిహారాలు పొందుతున్నారని ఎగ్జిక్యూటివ్ యాక్సెస్ సంస్థ ఎండీ రోణేష్ పురి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement