అమెరికాలో ఎన్నారై కుటుంబం దారుణ హత్య?! | Four members of Indian-origin family found dead in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఎన్నారై కుటుంబం దారుణ హత్య?!

Published Sat, Oct 7 2023 6:19 AM | Last Updated on Sat, Oct 7 2023 8:44 AM

Four members of Indian-origin family found dead in US - Sakshi

న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన దంపతులు, వాళ్ల ఇద్దరి పిల్లలు విగతజీవులుగా

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు హత్యకు గురయ్యారు. తేజ్‌ ప్రతాప్‌ సింగ్‌(43), సొనాల్‌ పరిహార్‌(42), వారి పదేళ్ల కొడుకు ఆయుష్, ఆరేళ్ల కూతురు ఆరీలు ప్లెయిన్స్‌బోరోలోని వారి సొంతింట్లోనే విగతజీవులై రక్తపు మడుగులో కనిపించారని పోలీసులు తెలిపారు.

ఐటీ నిపుణులుగా పనిచేస్తున్న సింగ్‌ దంపతులు 2018లో సొంతింటిని కొనుక్కున్నారని బంధువులు తెలిపారు. ఈ నెల 4న సాయంత్రం తమ ఫోన్‌కాల్‌కు సింగ్‌ దంపతులు స్పందించడం లేదంటూ వారి బంధువొకరు అధికారులను అలర్ట్‌ చేశారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా విషయం బయటపడింది.

బుధవారం రాత్రి వారు హత్యకు గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తేజ్‌ ప్రతాప్‌ సింగ్‌ సొంతూరు యూపీలోని జలౌన్‌ అని తెలిసింది. కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని ప్లెయిన్స్‌బోరో పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement