Indian origin couple
-
ఆ ప్రయాణమే ఆఖరిదైంది!
కాలం కత్తిగట్టింది.. కాపుకాసి కాటేసింది.. సాఫీగా సాగుతున్న ప్రయాణానికి కన్నీటి ముగింపు పలికింది. కుమార్తెను యూనివర్సిటీలో చేరుస్తున్నామన్న ఆనంద క్షణాల్లో ఘోరం జరిగి పోయింది.. రెప్పపాటులో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యు ఘంటికలు మోగాయి. ఒకే కుటుంబంలోని సభ్యుల ప్రాణాలు అనంత లోకాల్లో కలిసిపోయాయి. నిండు మనసుతో ఆశీస్సులు.. సరదా కబుర్లు, సందళ్లతో ఇంటి నుంచి యూనివర్సిటీకి సాగిన కారు ప్రయాణం ఊహించని కుదుపుతో విషాదాంతమైంది.అమెరికా టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో భారత సంతతికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులున్నారు. లియాండర్‌లో నివసించే అరవింద్ మణి (45), అతని భార్య ప్రదీపా అరవింద్(40), వారి 17 ఏళ్ల కుమార్తె ఆండ్రిల్ అరవింద్, ఆదిర్యాన్ (14)నివసిస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల హైస్కూల్ డిప్లామాను పూర్తి చేసుకున్న ఆండ్రిన్ అరవింద్‌కు కంప్యూటర్ సైన్స్ అంటే మహా ఇష్టం. డల్లాస్ యూనిర్సిటీలో చదవాలనేది ఆమె కోరిక. అందుకే కుమర్తె ఇష్టాన్ని కాదనలేని తల్లిదండ్రులు.. ఆమెను యూనివర్సిటీలో చేర్పించేందుకు కారులో బయలు దేరారు. ఆ ప్రయాణమే ఆఖరిదైంది! ఉన్నతమైన లక్ష్యాలు..ఎన్నో కోరికలతో ఇంటి నుంచి యూనివర్సిటీకి కారులో బయలు దేరిన ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదం రూపంలో అరవింద్ మణి కుటుంబాన్ని కబళించింది. లాంపాస్ కౌంటీ సమీపంలో గత బుధవారం తెల్లవారుజామున 5.45 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అరవింద్ మణి దంపతులు వారి కుమార్తె ఆండ్రిల్ అరవింద్ మృతి చెందారు.కారు ప్రమాదం ఎలా జరిగింది?కారు ప్రమాదంపై టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ (డీపీఎస్)అధికారి ట్రూపర్ బ్రయాన్ వాష్కో స్పందించారు. ‘కాపెరాస్ కోవ్‌కు చెందిన 31 ఏళ్ల జాసింటో గుడినో డ్యూరాన్, 23 ఏళ్ల యోసిలు గాస్మాన్ మార్టినెజ్‌లు హైపర్ కార్ ‘కాడిలాక్ సీటీఎస్’లో ప్రయాణిస్తున్నారు. సరిగ్గా ప్రమాదం జరిగిన ప్రాంతంలో అరవింద్ మణి ప్రయాణిస్తున్న 65 నుంచి 70 ఎంపీహెచ్ వేగంతో వెళ్తున్న కియా ‘టెల్లూరైడ్’ను.. 100 ఎంపీహెచ్ స్పీడుతో వస్తున్న కాడిలాక్ సీటీఎస్ ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత దాటికి కియా కారు సగానికి పైగా ధ్వంసమైంది.అరవింద్ ఫ్యామిలీ కారు కూడా మంటల్లో చిక్కుకుంది. అరవింద్ కుటుంబ సభ్యులు ఘటనా స్థలంలో మరణించారు’అని తెలిపారు.బతికే అవకాశాలు లేవుఘోర రోడ్డు ప్రమాదంపై 26 ఏళ్లలో నేను చూసిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం ఇది. అందుకు ప్రమాదం జరిగిన తీవ్రత, మరణాల సంఖ్యే కారణమని ట్రూపర్ బ్రయాన్ వాష్కో మీడియాకు తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బతికే అవకాశాలు ఉండవు అని వెల్లడించారు. కుటుంబాన్ని ఢీకొట్టిన కారు 160 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.విషాద సమయం.. పరిమళించిన మానవత్వంఇంతటి విషాదం నింపిన ఈ రోడ్డు ప్రమాదం 14ఏళ్ల అరవింద్ మణి కుమారుడు ఆదిర్యాన్ ఒంటరయ్యాడు. ఇక, ప్రమాదం తర్వాత దాతలు స్పందించి తీరు మానవత్వానికి అద్దం పడుతోంది. దుఃఖంలో ఉన్న బాలుడికి ఆర్థిక సహాయం అందించేందుకు ఫండ్ రైజర్ ఆర్గనైజర్ రాజారామన్ వెంకటాచలం గోఫండ్‌మీ ద్వారా ఫండ్ రైజ్ చేశారు. అందుకు 7లక్షల డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో దాతలు విరాళం ఇచ్చినట్లు రాజారామన్ చెప్పారు. ఆదిర్యాన్ భవిష్యత్ కోసం తాము ఫండ్ రైజ్ ప్రారంభించామని, బాలుడిని ఆదుకునేందుకు దాతలు భారీ మొత్తంలో విరాళం ఇచ్చినట్లు వెల్లడించారు. సేకరించిన ఫండ్‌తో బాలుడి భవిష్యత్‌ను అందంగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. -
అమెరికాలో ఎన్నారై కుటుంబం దారుణ హత్య?!
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు హత్యకు గురయ్యారు. తేజ్ ప్రతాప్ సింగ్(43), సొనాల్ పరిహార్(42), వారి పదేళ్ల కొడుకు ఆయుష్, ఆరేళ్ల కూతురు ఆరీలు ప్లెయిన్స్‌బోరోలోని వారి సొంతింట్లోనే విగతజీవులై రక్తపు మడుగులో కనిపించారని పోలీసులు తెలిపారు. ఐటీ నిపుణులుగా పనిచేస్తున్న సింగ్ దంపతులు 2018లో సొంతింటిని కొనుక్కున్నారని బంధువులు తెలిపారు. ఈ నెల 4న సాయంత్రం తమ ఫోన్‌కాల్‌కు సింగ్ దంపతులు స్పందించడం లేదంటూ వారి బంధువొకరు అధికారులను అలర్ట్ చేశారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా విషయం బయటపడింది. బుధవారం రాత్రి వారు హత్యకు గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తేజ్ ప్రతాప్ సింగ్ సొంతూరు యూపీలోని జలౌన్ అని తెలిసింది. కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని ప్లెయిన్స్‌బోరో పోలీసులు తెలిపారు. -
చౌకైన వెంటిలేటర్
వాషింగ్టన్: కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అమెరికాలోని భారతీయ దంపతులు ఓ వినూత్నమైన, చౌకైన వెంటిలేటర్‌ను తయారు చేశారు. మూడు వారాల వ్యవధిలోనే ఈ వెంటిలేటర్‌కు ఆలోచన చేయడంతోపాటు నమూనా యంత్రాన్ని తయారు చేసిన దేవేశ్ రంజన్, కుముదా రంజన్..దీనిని భారత్‌తోపాటు, పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవేశ్ రంజన్ జార్జియా టెక్ వర్సిటీలోని జార్జ్ డబ్ల్యూ వుడ్రఫ్ స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో అధ్యాపకుడిగా పనిచేస్తూండగా, కుముదా రంజన్ అట్లాంటాలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ‘‘ఈ యంత్రాన్ని వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేస్తే ఒక్కోదానికి రూ. 7,600 (వంద డాలర్లు) వరకూ అవుతుంది. ఐదు రెట్లు ఎక్కువ ధరకు అమ్మినా తయారీదారుకు మంచి లాభాలే వస్తాయి’’అని దేవేశ్ రంజన్ పీటీఐతో చెప్పారు. అమెరికాలో సాధారణ వెంటిలేటర్ ఖరీదు ఏడెనిమిది లక్షల వరకూ ఉంటుందని చెప్పారు. ఊపిరితిత్తులు బలహీనపడిన సందర్భాల్లో శ్వాసను అందించేందుకు వెంటిలేటర్లు ఉపయోగిస్తారన్నది తెలిసిన విషయమే. శ్వాస వేగం, ఉచ్ఛ్వాస, నిశ్వాసాల్లో గాలి మోతాదు, ఊపిరితిత్తులపై పీడనం వంటి అన్ని అంశాల నిర్వహణకు దేవేశ్, కుముద్ రంజన్లు ఎలక్ట్రానిక్ సెన్సర్లు, కంప్యూటర్ నియంత్రణలను ఉపయోగించారు. దీన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మాత్రం వాడే అవకాశం లేదని, అది మరింత అత్యాధునికమైందని వారు స్పష్టం చేశారు. దేవేశ్ స్వస్థలం బిహార్‌లోని పట్నా కాగా, కుముద్ రాంచీకి చెందిన వారు. భారత్‌తోపాటు ఆఫ్రికా దేశం ఘనాలో ఈ వెంటిలేటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జార్జియా టెక్ పూర్వ విద్యార్థులు తమను సంప్రదించినట్లు దేవేశ్ తెలిపారు. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న రిన్యూ గ్రూపు ఈ యంత్రాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉందని ఆ సంస్థ అధ్యక్షుడు ఉత్తరాఖండ్‌కు చెందిన రవీ సజ్వాన్ తెలిపారు. -
యూఎస్‌లో ఎన్నారై దంపతుల దారుణ హత్య
వాషింగ్టన్: అమెరికాలో ఓ భారతీయ సంతతి దంపతుల హత్య జరిగింది. వారి కూతురి మాజీ బాయ్‌ఫ్రెండే ఈ దారుణానికి తెగబడ్డాడు. ప్రతీకారంతోనే అతడు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. పూర్తి వివారల్లోకి వెళితే.. సీబీఎస్ శాన్ఫ్రాన్సిస్కోలోని శాన్ బోస్‌లో నరేన్ ప్రభు కుటుంబం ఉంటోంది. అతడికి ఓ కుమార్తె ఇద్దరు కుమారులు. నరేన్ ప్రభు సిలికాన్ వ్యాలీలోని ఓ ఐటీ కంపెనీలో ఎగ్జిక్యూటీప్ అధికారిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వారి కూతురు వేరే రాష్ట్రంలో ఉంటోంది. ఆమెకు మిర్జా టాట్లిక్ (24) అనే యువకుడు గతంలో బాయ్ ఫ్రెండ్‌గా ఉండేవాడు. అయితే, వారిద్దరు గత ఏడాదే విడిపోయారు. వారిద్దరు విడిపోవడానికి తన గర్ల్‌ఫ్రెండ్ తల్లిదండ్రులే అని పగ పెంచుకున్న మిర్జా టాట్లిక్ నేరుగా తుపాకీతో ఇంటికొచ్చి వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం నరేన్ పెద్ద కొడుకు పోలీసులకు చెప్పాడు. ఆ సమయంలో 13 ఏళ్ల మరో బాలుడు ఇంట్లోనే ఉన్నాడు. ఆ బాలుడిని కూడా కాల్చే సమయానికి పోలీసులు చేరుకుని నిలువరించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కాల్పులు జరిపిన టాట్లిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.