యూఎస్‌లో ఎన్నారై దంపతుల దారుణ హత్య | Indian American Couple Shot Dead In US | Sakshi
Sakshi News home page

యూఎస్‌లో ఎన్నారై దంపతుల దారుణ హత్య

Published Sat, May 6 2017 2:50 PM | Last Updated on Wed, Aug 15 2018 5:57 PM

యూఎస్‌లో ఎన్నారై దంపతుల దారుణ హత్య - Sakshi

యూఎస్‌లో ఎన్నారై దంపతుల దారుణ హత్య

వాషింగ్టన్‌: అమెరికాలో ఓ భారతీయ సంతతి దంపతుల హత్య జరిగింది. వారి కూతురి మాజీ బాయ్‌ఫ్రెండే ఈ దారుణానికి తెగబడ్డాడు. ప్రతీకారంతోనే అతడు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. పూర్తి వివారల్లోకి వెళితే.. సీబీఎస్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలోని శాన్‌ బోస్‌లో నరేన్‌ ప్రభు కుటుంబం ఉంటోంది. అతడికి ఓ కుమార్తె ఇద్దరు కుమారులు. నరేన్‌ ప్రభు సిలికాన్‌ వ్యాలీలోని ఓ ఐటీ కంపెనీలో ఎగ్జిక్యూటీప్‌ అధికారిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వారి కూతురు వేరే రాష్ట్రంలో ఉంటోంది.

ఆమెకు మిర్జా టాట్లిక్‌ (24) అనే యువకుడు గతంలో బాయ్‌ ఫ్రెండ్‌గా ఉండేవాడు. అయితే, వారిద్దరు గత ఏడాదే విడిపోయారు. వారిద్దరు విడిపోవడానికి తన గర్ల్‌ఫ్రెండ్‌ తల్లిదండ్రులే అని పగ పెంచుకున్న మిర్జా టాట్లిక్‌ నేరుగా తుపాకీతో ఇంటికొచ్చి వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం నరేన్‌ పెద్ద కొడుకు పోలీసులకు చెప్పాడు. ఆ సమయంలో 13 ఏళ్ల మరో బాలుడు ఇంట్లోనే ఉన్నాడు. ఆ బాలుడిని కూడా కాల్చే సమయానికి పోలీసులు చేరుకుని నిలువరించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కాల్పులు జరిపిన టాట్లిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement