technical skills
-
కాస్త సరదాగా నేర్చుకుందాం...
కాలంతో పాటు ఆసక్తులు మారుతుంటాయి. అయితే అవి కాలక్షేప ఆసక్తులు కాకుండా భవిష్యత్ కార్యాచరణకు అవసరమైనవి అయితే ఎంతో బాగుంటుంది. ప్రస్తుతం జరుగుతున్నది అక్షరాలా అదే! బ్రిటిష్ సాప్ట్వేర్ డెవలపర్,రచయిత, పబ్లిక్ స్పీకర్ మార్టిన్ ఫౌలర్ ‘ప్రోగామ్ రాయడానికి అసాధారణమైన నైపుణ్యం అక్కర్లేదు’ అని ఎంతోమందికి చెప్పి పుణ్యం కట్టుకున్నాడు. ‘మీ హాబీస్ ఏమిటి?’ అనే ప్రశ్నకు ‘సినిమాలు చూడడం’ ‘సంగీతం వినడం’ ‘కవిత్వం రాయడం’ ‘ఫేస్బుక్లో పోస్ట్‌లు పెట్టడం’... ఇలాంటి సమాధానాలు ‘యూత్’ నుంచి రావడం ఎప్పుడూ ఉండేదే. అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట... ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్! ‘సరదాగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాను’ అని చెప్పేవారు పెరుగుతున్నారు. అయితే తమ చదువుకు కొనసాగింపుగానో, భవిష్యత్ ప్రణాళికలో భాగంగానో నేర్చుకోవడం లేదు. కాస్త సరదాగా మాత్రమే నేర్చుకుంటున్నారు. కోవిడ్ సృష్టించిన విరామసమయం ఎన్నో ‘డిజిటల్’ ఆసక్తులకు తెరతీసింది. అందులో ప్రోగామింగ్ లాంగ్వేజెస్ కూడా ఒకటి. యూత్ ఆసక్తి చూపుతున్న లాంగ్వేజెస్‌లలో టెక్ దిగ్గజం యాపిల్ అఫిషియల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ‘స్విఫ్ట్’లాంటివి ఉన్నాయి. ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి స్విఫ్ట్ ప్రోగామింగ్ ఫర్ బిగినర్స్... మొదలైన ఆన్లైన్ కోర్సులను ఆశ్రయిస్తున్నారు. ఇక పైథాన్ సంగతి సరేసరి. ఇంట్రడక్షన్ టు ఫైథాన్ ప్రోగ్రామింగ్, పైథాన్ ఫ్రమ్ బిగినెర్ టు ఇంటర్మీడియట్ ఇన్ 30 మినిట్స్, ఎనాలసిస్ డాటా విత్ ఫైథాన్... మొదలైన ఫ్రీ ఆన్లైన్ కోర్సులు యువతను ఆకర్షిస్తున్నాయి. ఈ కోర్సులు పైథాన్ ప్రోగ్రామింగ్‌కు బేసిక్ ఇంట్రడక్షన్ గా పనిచేస్తున్నాయి. వీటి ద్వారా స్క్రిప్ట్, ఫంక్షన్స్ రాయడంలో మెలకువలు నేర్చుకుంటున్నారు. ఈ ఫ్రీ కోర్సు నేర్చుకోవడానికి 5 వారాల సమయం పడుతుంది. ‘టెక్నికల్ విషయాలు అంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు’ అనే వాళ్లు కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ‘నేర్చుకున్నది ఏదీ వృథా పోదు’ అన్నట్లుగా తాము నేర్చుకుంటున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తమలోని సృజనను పదునుపెట్టడానికి పనికొస్తున్నాయి. ప్రోగామింగ్‌లో లాజిక్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆర్గనైజేషన్... అనే కీలక అంశాలు తమను తాము మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రోగ్రామింగ్‌లో నిరూపించుకోవడానికి కంప్యూటర్ సైన్స్ పట్టాతో అట్టే పనిలేదని నిరూపించుకోవడానికి బిలాల్‌ను ఉదాహరణగా చూపవచ్చు. ముంబైకి చెందిన బిలాల్ ఫైనాన్స్ డిగ్రీ చేసిన విద్యార్థి. టెక్ విషయాలపై ఆసక్తితో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు నేర్చుకున్నాడు. ఇదేమీ వృ«థా పోలేదు. చిన్నపాటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చేలా చేసింది. తరువాత తానే ఒక సాఫ్ట్వేర్ ల్యాబ్‌ను మొదలుపెట్టాడు. పదవ తరగతి మధ్యలో మానేసిన వాళ్లు కూడా ప్రోగ్రామింగ్‌లో అద్భుత మైన ప్రతిభ చూపుతున్న ఉదాహరణలు మనకు ఉన్నాయి. వీరు మార్టిన్ ఫౌలర్ మాట విని ఉండకపోవచ్చు. అతడి ఉపన్యాసంతో ప్రభావితమైన అనేక మందిలో మనం లేకపోవచ్చు. అయితే ఆయన చెప్పిన ‘ప్రోగ్రాం రాయడానికి అసాధారణమైన నైపుణ్యం అక్కర్లేదు’ అనే మాటతో మాత్రం పూర్తిగా ఏకీభవిస్తారు. కొంతకాలం క్రితం గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ‘పే పాల్’ ఒక సర్వే నిర్వహించింది. స్కూల్, కాలేజీలలో చదివే 96 శాతం మంది అమ్మాయిలు కొత్త సాంకేతిక విషయాలు నేర్చుకోవడానికి అమిత ఆసక్తి చూపుతున్నారని చెప్పింది. ఈ సంతోషాన్ని రెట్టింపు చేసింది తాజా బైట్ ఎక్స్ఎల్ సర్వే. హైదరాబాద్‌కి చెందిన ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ ‘బైట్ ఎక్స్ఎల్’ డీప్ టెక్ ఇన్సైట్స్ 2021–2022 నివేదిక సాంకేతిక అంశాల పట్ల అమ్మాయిలు ఆసక్తి చూపుతున్నారని, నైపుణ్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలియజేసింది. -
టెక్ రెజ్యూమె రూపొందించేదెలా?
కొలువు కావాలంటే దరఖాస్తుతోపాటు తప్పనిసరిగా పంపాల్సింది.. రెజ్యూమె. ఇది రంగాన్ని, ఉద్యోగాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. ఒకే ఫార్మాట్లోని రెజ్యూమె అన్ని రకాల కొలువులకు సరిపోదు. సాంకేతిక కొలువులకు దరఖాస్తు చేస్తే.. సంబంధిత రెజ్యూమెను జతచేయాలి. ఇది టెక్ ఫ్రెండ్లీగా ఉండాలి. టెక్నాలజీలో మీ అర్హతలు, అనుభవం, నైపుణ్యాలను రిక్రూటర్‌కు సరిగ్గా తెలియజేయాలి. టెక్ రెజ్యూమె అనేది మీకు తెలిసిన ప్రోగ్రామ్ లాంగ్వేజ్ల ద్వారా కంటే ఎక్కువగా మీ గురించి వెల్లడించాలి. ఇది సక్రమంగా ఉంటే సగం పని పూర్తయినట్లే. టెక్నాలజీ జాబ్స్‌పై ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ ప్రొఫెషనల్స్ టెక్ రెజ్యూమెపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. సాంకేతిక నైపుణ్యాలు: టెక్నాలజీ రెజ్యూమె రచనలో ఇతర విషయాల కంటే మీలోని టెక్నికల్ స్కిల్స్‌కే పెద్దపీట వేయాలి. వీటిని ప్రముఖంగా పేర్కొనాలి. హైరింగ్ మేనేజర్ మీ రెజ్యూమెను ఆసాంతం చదవలేరు. మొదట మీలోని సాంకేతిక నైపుణ్యాలనే పరిశీలిస్తారు. వాటిపట్ల సంతృప్తి చెందితేనే మిగిలిన అంశాలపై దృష్టి సారిస్తారు. అనుభవాలు: మీ అనుభవాలను క్లుప్తంగా 3, 4 లైన్లలో ప్రస్తావిస్తూ రెజ్యూమెను ప్రారంభించండి. తర్వాత వివిధ విభాగాల్లో మీ టెక్నికల్ స్కిల్స్‌ను విపులంగా పేర్కొనండి. ఉదాహరణకు.. ఆపరేటింగ్ సిస్టమ్స్: విండోస్, యూనిక్స్, లైనక్స్ లాంగ్వేజెస్: జావా, విజువల్ బేసిక్, సీ/సీ++, పెర్ల్ డేటాబేస్: ఒరాకిల్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ నెట్వర్కింగ్: టీసీపీ/ఐపీ, లాన్/వాన్. మీ ప్రొఫైల్‌కు వర్తించే ప్రోగ్రామ్స్/అప్లికేషన్లను మాత్రమే ప్రస్తావించండి. తెలియని వాటిని కూడా పేర్కొంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలో పూర్తి ఆత్మవిశ్వాసంతో చర్చించగలిగే సాంకేతిక అంశాలనే రెజ్యూమెలో చేర్చండి. అంటే వాటిపై మీకు మంచి పరిజ్ఞానం ఉండాలి. అప్పుడే ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలుగుతారు. మీరు ఇప్పటికే ఒక సంస్థలో పనిచేసి ఉంటే అక్కడ సాధించిన విజయాలను కూడా పేర్కొనండి. కీలక పదాలు: ఐటీ రెజ్యూమెకు సరిగ్గా నప్పే సాంకేతిక పదాలు కొన్ని ఉంటాయి. వాటితో రెజ్యూమెకు నిండుదనం వస్తుంది. కాబట్టి ఆయా పదాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు.. యాక్టివేటెడ్, డిజైన్డ్, ఆర్గనైజ్డ్, అసిమిలేటెడ్, డెవలప్డ్, ఇనిషియేటెడ్, యుటిలైజ్డ్, డెమాన్స్ట్రేటెడ్, ఇన్స్టాల్డ్ వంటి పదాలను రెజ్యూమె రచనలో సందర్భానుసారంగా ఉపయోగించాలి. జూనియర్, సీనియర్: జూనియర్, సీనియర్ ప్రొఫెషనల్స్ రెజ్యూమె కంటెంట్ వేర్వేరుగా ఉంటుంది. అనుభవజ్ఞులు, అనుభవం లేనివారి అర్హతలు, నైపుణ్యాలు ఒకేలా ఉండవు. ఈ భేదాన్ని గుర్తించాలి. తొలిసారిగా టెక్ కెరీర్లోకి ప్రవేశించబోయేవారు రెజ్యూమెలో తమ స్కిల్స్, ప్రాజెక్ట్‌లపై ఎక్కువ ఫోకస్ చేయాలి. జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ భువనేశ్వర్‌లోని సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. సీనియర్ మేనేజర్ (ప్రొడక్షన్) అర్హతలు: మెకానికల్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఎనిమిదేళ్ల అనుభవం అవసరం. మేనేజర్ (ప్రొడక్షన్) అర్హతలు: టూల్ డిజైన్‌లో పీజీ లేదా పీజీ డిప్లొమా ఉండాలి. ఐదేళ్ల అనుభవం అవసరం. సీనియర్ ఇంజనీర్ (ప్రొడక్షన్) అర్హతలు: పీజీ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్/ ప్రొడక్షన్ లేదా క్యాడ్-క్యామ్ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31 వెబ్సైట్: www.cttc.gov.in ఎయిమ్స్ న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. పీజీ ప్రోగ్రాములు ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్ విభాగాలు: క్లినికల్ సెన్సైస్, బేసిక్ క్లినికల్ సెన్సైస్, డెంటల్ మొదలైనవి. ఎంసీహెచ్ విభాగాలు: న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ. అర్హతలు: ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉండాలి. మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అర్హతలు: ఎంబీబీఎస్ ఉండాలి. పీహెచ్డీ ప్రోగ్రామ్ విభాగాలు: అనెస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బయోటెక్నాలజీ, సీటీసీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ల్యాబ్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెమటాలజీ, మైక్రోబయాలజీ, మెడికల్ అంకాలజీ మొదలైనవి. అర్హతలు: ఎంబీబీఎస్ ఉండాలి. ఎంపిక: ప్రవేశ పరీక్ష (ఆన్లైన్ టెస్ట్), డిపార్ట్మెంటల్ అసెస్మెంట్ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 16 వెబ్సైట్: www.aiimsexams.org జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ భువనేశ్వర్‌లోని జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. ఎంబీఏ ప్రోగ్రామ్ విభాగాలు: బిజినెస్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, రూరల్ మేనేజ్మెంట్, సస్టెయినబిలిటీ మేనేజ్మెంట్, గ్లోబల్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్. అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. గ్జాట్/ క్యాట్/ జీమ్యాట్‌లో అర్హత సాధించాలి. ఎంబీఏ (ఎగ్జిక్యూటివ్) అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ (మేనేజ్మెంట్) అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. పీహెచ్డీ (మేనేజ్మెంట్) అర్హతలు: ఎంబీఏ లేదా మేనేజ్మెంట్లో పీజీ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 5 వెబ్సైట్: http://ximb.sify.net/ -
విజయానికి ‘స్కిల్’ మంత్ర
సక్సెస్.. గెలుపు.. విజయం.. ఇలా ఏ పేరుతో పిలిచినా.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాత్రం ‘స్కిల్స్’ అవసరం. ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్సులను చదువుతున్న విద్యార్థులు టెక్నికల్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకున్నప్పుడే ‘కెరీర్’ అనే మ్యాచ్‌లో విన్నింగ్ షాట్ సాధ్యమవుతుంది. నేటి జాబ్ మార్కెట్లో అందరి నోట ఒకటే మాట..స్కిల్స్.. స్కిల్స్! ప్రతి విద్యార్థి మదిలోనూ అదే సందేహం.. స్కిల్స్ అంటే ఏమిటి? ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే.. ఎటువంటి స్కిల్స్ కావాలి? అసలు కంపెనీలు అభ్యర్థుల్లో స్కిల్స్ ఉండాలని ఎందుకు ఆశిస్తాయి? ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే.. నైపుణ్యాలు (స్కిల్స్) తప్పనిసరి. అందరికంటే మీరు మెరుగైనవారు అని నిరూపించుకోవడానికి టెక్నికల్, ప్రొఫెషనల్ స్కిల్స్ ఉపయోగపడతాయి. సాధన చేయాలి: స్కిల్స్ అంటే.. అదో బ్రహ్మపదార్థం ఏమీ కాదు.. మీరు ఎంచుకున్న రంగంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు మాత్రమే! పుస్తకాల్లో, ఇంటర్నెట్లో స్కిల్స్ గురించి విస్తారమైన సమాచారం ఉంది. ఇవన్నీ నైపుణ్యాల విషయంలో మీకు ప్రాథమిక అవగాహనను కల్పించేందుకు ఉద్దేశించినవి. ఆయా నైపుణ్యాల్లో మీరు ఎంచుకున్న రంగానికి సరిపడే అంశాలను గుర్తించి సాధన చేయాలి. వివిధ పరిశ్రమలకు అందులోని పలురకాల ఉద్యోగాలను బట్టి వేర్వేరు స్కిల్స్ కావాలి. అప్పుడే ‘కెరీర్’ అనే నావ విజయ తీరాలకు చేరుతుంది. స్కిల్స్‌కు సంబంధించి ప్రొఫెషనల్ స్కిల్స్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ అనే రెండు రకాలు ఉంటాయి. చాలావరకు నైపుణ్యాలన్నీ ప్రొఫెషనల్ స్కిల్స్‌కు సంబంధించినవే. కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, సృజనాత్మకత.. ఇవన్నీ ప్రొఫెషనల్ స్కిల్స్. వృత్తి పరంగా ఉన్నత స్థానానికి ఎదగడానికి ఈ నైపుణ్యాలన్నీ దోహదం చేస్తాయి. మనం చదువుకున్న సబ్జెక్ట్ ఆధారంగా పెంపొందించుకునేవి టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ ప్రభావవంతంగా లేకుంటే ఇంటర్వ్యూలో.. మిమ్మల్ని షార్ట్‌లిస్ట్ సమయంలో పరిగణనలోకి కూడా తీసుకోరు. కెరీర్లో విజయం సాధించాలంటే ప్రొఫెషనల్ స్కిల్స్‌తోపాటు టెక్నికల్ స్కిల్స్ కూడా కీలకమనే విషయాన్ని గుర్తించాలి. ఈ స్కిల్స్‌ను తెలుసుకోవడం ఎలా? చక్కని హోదా, మంచి జీతం.. ఇలా కెరీర్ పరంగా మీకు ప్రాధాన్యం ఉన్నట్లే.. కంపెనీలు కూడా తాము నియమించుకునే ఉద్యోగుల నుంచి కొన్ని లక్షణాలను ఆశిస్తాయి. అధిక శాతం కంపెనీలు ఉద్యోగులు సంస్థలో చేరిన వెంటనే వేగంగా నేర్చుకోవడంతోపాటు ప్రస్తుత పరిస్థితులతో పోటీ పడుతూ కంపెనీనీ ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటాయి. అందుకనుగుణంగా మీలో నైపుణ్యాలు ఉన్నాయా? అనే అంశాన్ని ఇంటర్వ్యూ ద్వారా పరీక్షిస్తాయి. కాబట్టి స్కిల్స్‌కు పదును పెట్టడం తప్పనిసరి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. చాలామంది విద్యార్థుల్లో ఒక సందేహం.. ఎటువంటి నైపుణ్యాలు కావాలి? ఒక్కసారి మీకు ఏ రంగం పట్ల ఆసక్తి ఉందో తెలిస్తే.. అందుకు కావల్సిన స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవచ్చు. ఉదాహరణకు మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి.. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ కనిపిస్తాడు. దీనికి కారణం.. అతనికి ఆ రంగం పట్ల ఉన్న ఆసక్తి అని చెప్పొచ్చు. అసలు నైపుణ్యాలు ఎందుకు? అసలు నైపుణ్యాలు ఎందుకు? సమాధానం చాలా సులువు.. సమస్యలను పరిష్కరించడానికి. ఉదాహరణకు ఇంటర్వ్యూ ఏదైనా.. అది టెక్నికల్ లేదా సాఫ్ట్‌స్కిల్స్ ఏ విభాగమైనా.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీలోని సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తాడు. దీన్ని సాధారణంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్‌గా వ్యవహరిస్తాం. పేపర్-పెన్సిల్ టెస్ట్, మ్యాథమెటికల్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, కేస్ స్టడీ వంటి పలు అంశాల ద్వారా ఈ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. మరికొన్ని కంపెనీలు ఇంటర్వ్యూ చేసే క్రమంలోనే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పరీక్షిస్తాయి. సాధారణంగా ప్రతి కంపెనీకి సమస్యను పరిష్కరించే మానవ వనరులు కావాలి. అందుకే సమస్యను పరిష్కరించే మ్యాన్‌పవర్‌ను రిక్రూట్ చేసుకోవడానికి ప్రాధాన్యతనిస్తాయి. కాబట్టి సమస్యా సాధన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఏదైనా అంశంపై అధ్యయనం చేసేటప్పుడు.. ప్రాథమిక భావనల నుంచి ప్రారంభించి క్రమంగా విస్తరించుకుంటూ.. ఆ విషయ లోతుల్లోకి వెళ్లాలి. ఈ నైపుణ్యాన్ని ఇంటర్వ్యూలో పరిశీలిస్తారు. కంపెనీ, జాబ్‌రోల్ ఏదైనా.. మీలోని సమస్యా పరిష్కార సామర్థ్యాన్ని మూల్యాంకనం చేస్తారు. ఎంచుకున్న రంగం, అందులో పని చేసే విభాగాన్ని బట్టి ఈ మూల్యాంకన ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చదివిన కోర్సులోని అంశాలను ప్రాక్టికల్‌గా ఎంతమేరకు అన్వయం చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నామన్నది మరో కీలకాంశం. ఇంటర్న్షిప్స్ వంటి రియల్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్ ద్వారా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే.. ఉద్యోగావకాశాలను పెంపొందించుకోవచ్చు. అందుకు మార్గం ఇంటర్న్షిప్స్.. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. వీటి ద్వారా పెంపొందించుకున్న నైపుణ్యాలకు ఇంటర్వ్యూలో పెద్దపీట వేస్తున్నారు. ఎందుకంటే.. పరిశ్రమల దృష్టిలో క్షేత్రస్థాయి పరిస్థితులను అవగాహన చేసుకునేందుకు ఉత్తమ మార్గం ఇదొక్కటే. కనక్ట్ చేసుకోవడం ఎలా: ప్రస్తుతం చాలా మంది తాము చదివిన డిగ్రీకి, చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఉండడం లేదు. ఇటువంటి సందర్భాల్లో డిగ్రీల కంటే నైపుణ్యాలే ఉద్యోగావకాశాలను ప్రభావితం చేస్తాయని చెప్పొచ్చు. ఉదాహరణకు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్.. ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీలో డెవలప్మెంట్ రోల్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. ప్రోగ్రామింగ్, కోడింగ్ స్కిల్స్ తెలిసి ఉండాలి. అదే విద్యార్థి కన్సల్టింగ్ అండ్ అనలిటిక్స్ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. అనలిటికల్ స్కిల్స్, సంబంధిత రంగంపై అవగాహన అవసరం. చదివిన డిగ్రీ ఒక్కటే. కానీ.. ఎంచుకున్న రంగం ఆధారంగా స్కిల్స్ మారుతున్నాయి. అందుకే.. స్కిల్స్‌కు అంత ప్రాధాన్యం. అవసరాలకనుగుణంగా వాటిపై అవగాహన పెంచుకుంటే.. విజయానికి మార్గం దొరికినట్టే. కాబట్టి ముందుగా ఎంచుకున్న రంగం, కంపెనీని బట్టి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి.