Mind Reading AI Technology: ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది.. ఈ నేపథ్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరింత వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఇప్పటికే పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా టెక్ కంపెనీల విషయంలో 'ఏఐ' సంచలనాలు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా ఏఐ మనిషి మైండ్ కూడా చదివేస్తుందనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
తాజాగా సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మనసును చదవగలిగే సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీంతో మనిషి మనసును కూడా ఏఐ చదవగలదని చెబుతున్నారు. ఈ ఆధునిక టెక్నాలజీ మీద పరిశోధన బృందంలో ఒకరైన 'లి రుయిలిన్' కీలక విషయాలు వెల్లడించారు.
ప్రతి మనిషికి ఇతరులు ఏమి ఆలోచిస్తున్నారని, దానిని తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. ఇలాంటి వాటికోసం మైండ్ రీడింగ్ ఏఐ టెక్నాలజీ రూపొంచాలని సంకల్పించి ప్రయోగం ప్రారంభించామని, మొదట్లో తన మెదడుని ఈ టెక్నాలజీ ఆధారంగా పరిశీలించగా అద్భుతమైన ఫలితం వచ్చిందన్నారు. మొత్తం మీద మెదడు ఆలోచనను పసిగట్టే టెక్నాలజీ చాలా అద్భుతం అని వెల్లడించారు.
ఇదీ చదవండి: దేశీయ మార్కెట్లో మరో జర్మన్ కారు - ధర రూ. 1.14 కోట్లు
MRI స్కాన్ ద్వారా..
మైండ్ రీడింగ్ AI ని అభివృద్ధి చేయడంలో పనిచేస్తున్న పరిశోధకులకు 58 మంది తమ మైండ్ పరిశోధన చేసుకోవచ్చని స్వచ్చందగా ముందుకు వచ్చారు. అందులో లి రుయిలిన్ కూడా ఒకరు కావడం గమనార్హం. ఈ టెక్నాలజీ పూర్తిగా MRI స్కాన్ ద్వారా కొనసాగుతుంది, ఇందులో భాగంగా మెదడుకి సంబంధించి సుమారు 1200 నుంచి 5000 చిత్రాలను తీసి, దానిపై స్టడీ చేసి అసలు విషయం గుర్తించడం జరుగుతుంది.
ఇదీ చదవండి: ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఆగండాగండి.. ఇవి చెక్ చేశారా?
చాట్ జీపీటీ మనుషుల భాషను అర్థం చేసుకున్నట్లే.. ఏఐ మానవ మెదడుని కూడా అర్థం చేసుకుంటుంది. అంటే మనసులోని ఆలోచనలను చదివి పరిశోధకులకు అందిస్తుందన్నమాట. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిందంటే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అయితే దీనిని ఎవరైన అనవసర విషయాలకు లేదా తప్పుడు పనులకు ఉపయోగిస్తే పెద్ద ముప్పు వాటిల్లుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment