ఇప్పటి వరకు ఏఐ టీచర్, ఏఐ యాంకర్, ఏఐ ఉద్యోగుల గురించి చాలా కథనాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఏఐ అమ్మ (ఏఐ మదర్) 'కావ్య మెహ్రా' (Kavya Mehra) వచ్చేసింది. ఈమెను భారతదేశంలోని అతిపెద్ద సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ సంస్థలలో ఒకటైన కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్‌వర్క్ ప్రారంభించింది.
కావ్య మెహ్రా కేవలం డిజిటల్ అద్భుతం మాత్రమే కాదు, టెక్నాలజీలో ఓ విప్లవాత్మక శక్తి. వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు సోషల్ మీడియా ప్రపంచాన్ని ఆక్రమిస్తున్న తరుణంలో.. మొట్ట మొదటి ఏఐ మదర్ పుట్టింది. ఈమెకు (కావ్య) ఇన్‌స్టాగ్రామ్‌లో 300 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. వారితో మాతృత్వంపై తన ఆధునిక టెక్నాలజీని షేర్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కావ్య మెహ్రా సృష్టికర్తలు ప్రకారం.. కావ్య వ్యక్తిత్వం నిజమైన తల్లుల నిజ జీవిత అనుభవాల ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఈమె కేవలం డిజిటల్ అవతార్ మాత్రమే కాదు.. ఆధునిక మాతృత్వ స్వరూపం అని అన్నారు. మానవ అనుభవంలోని చాలా విషయాలు ఈమె మిళితం చేసుంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment